పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
== తొలి జీవితం ==
[[తెలంగాణ]] లోని [[వరంగల్ జిల్లా]], [[నర్సంపేట]] మండలం [[లక్నేపల్లి]] గ్రామంలో [[1921]] జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. [[వరంగల్లు జిల్లా]]లోనే [[ప్రాథమిక విద్య]] మొదలుపెట్టాడు. తరువాత [[కరీంనగర్ జిల్లా]], [[భీమదేవరపల్లి]] మండలం [[వంగర (వంగర మండలం)|వంగర]] గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనును దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి [[నిజాము]] ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ [[వందేమాతరం]] గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి అతనును బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు[[నాగపూర్ (మహారాష్ట్ర)|నాగపూర్]] విశ్వవిద్యాలయంలో చేరి [[నాగపూరు|నాగపూరులో]]లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివాడు.<ref>{{Cite web |title=How Rao got admission to Law College|url=http://www.rediff.com/news/2004/dec/23rao4.htm|date=2004}}</ref> [[స్వామి రామానంద తీర్థ]], [[బూర్గుల రామకృష్ణారావు]] ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు [[మర్రి చెన్నారెడ్డి]], శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసాడు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.
 
== రాష్ట్ర రాజకీయాల్లో పీవీ ==
పంక్తి 99:
పివి జీవితచరిత్ర పై హాఫ్ లయన్ <ref name=HalfLion /> అనే పుస్తకం వినయ్ సీతాపతి రాశాడు. ఇది 2016 లో విడుదలైంది.
[[File:The Vice President, Shri M. Hamid Ansari releasing the book on P.V. Narasimha Rao titled ‘Half-Lion’, authored by Shri Vinay Sitapati, in New Delhi on June 27, 2016.jpg|thumb| 2016 జూన్ 27న హాఫ్ లయన్ పుస్తకం విడుదల, హమీద్ అన్సారీ ద్వారా]]
జైరామ్ రమేష్ రచించిన 'TO THE BRINK & BACK: INDIA's 1991 STORY' లో ప్రధానంగా భారతదేశ ఆర్థిక సంస్కరణలు నరసింహారావు గారి నేతృత్వంలో ఎలా రూపుదిద్దుకున్నాయో చర్చింపబడింది.
 
== పీవీ నిర్వహించిన పదవులు ==