రేవూరి అనంత పద్మనాభరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
1975 ఆగస్టు 16న [[ఆకాశవాణి]] కడప కేంద్రంలో తెలుగు ప్రసారాల ప్రొడ్యూసర్ గా చేరి 75-82 మధ్యకాలంలో కడప, [[విజయవాడ]]లలో పనిచేశారు. 1982 అక్టోబరు నుండి [[ఆకాశవాణి]] [[హైదరాబాదు]] కేంద్రంలో అసిస్టెంట్ స్టేషను డైరక్టరుగా (UPSC సెలక్షన్) 85 జనవరి వరకు పనిచేశారు. 85-87 మధ్య కాలంలో వాణిజ్య ప్రసార విభాగం అధిపతిగా చేశారు. 1987 ఏప్రిల్ నుండి 88 వరకు ఢిల్లీ లోని Staff Training Instititue లో పనిచేశారు. 1988 లో UPSC ద్వారా డైరక్టర్ గా సెలక్టయి డైరక్టరేట్ జనరల్ కార్యాలయంలో ప్రసంగాల శాఖ డైరెక్టర్ గా (Director of Programmes, Spoken word) గా పనిచేశారు. 88-90 మధ్య ఢిల్లీ స్టాఫ్ ట్రైయినింగ్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డై రెక్టర్ గా రెండేళ్ళు పనిచేశారు. 1990 ఆగస్టు నుండి అనంతపురం ఆకాశవాణి తొలి డైరెక్టరుగా మూడేళ్లు పనిచేశారు. సెలక్షన్ గ్రేడ్ డైరెక్టరుగా 93-95 మధ్యకాలంలో కడప కేంద్ర డైరెక్టర్ గా పనిచేశారు. 1995 మార్చి నుంచి 1997 సెప్టెంబరు వరకు విజయవాడ కేంద్ర  డైరెక్టరుగా వ్యవహరించారు. ఆకాశవాణి [[కొత్తగూడెం]] కేంద్రం ప్రారంభ సమయంలో 1989 మార్చిలో ఆయన తొలి డైరెక్టరుగా పని చేశారు. 1997 అక్టోబరు నుంచి 2000  జూన్ వరకు దేశ రాజధానిలోని ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర డైరెక్టరుగా బాధ్యతలు  నిర్వహించిన  తెలుగువాడు. 2000  సంవత్సరంలో నేషనల్ ఛానెల్, ఢిల్లీ డైరెక్టరుగా ఉన్నారు.  2001లో  ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో ప్రతిష్టాత్మక పాలసీ విభాగ డైరెక్టరయ్యారు. 2001 ఆగస్టు నుంచి దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్  జనరల్ (ఇప్పుడు అదనపు డైరెక్టర్ జనరల్) హోదాలో  నాలుగేళ్ళు పనిచేసి 2005 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. 2011-12 మధ్య హైదరాబాద్  లోని నారాయణ ఐఏఎస్  అకాడమీ తొలి  ప్రిన్సిపల్. 2019-20 లలో  హైదరాబాద్  లోని 21 వ సెంచరీ ఐఏఎస్  అకాడమీలో  డీన్.
==తిరుపతి తిరుమల దేవస్థానములో భాద్యతలు==
ఢిల్లీలో పదవీ విరమణ చేసి విమానంలో తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి శర్మ తారసపడ్డారు. రిటైర్‌మెంట్ అనంతరం ఏం చేయాలనుకుంటున్నారని ఆయన అడిగితే పదవీ విరమణ అనంతరం తనకు శ్రీవెంకటేశ్వరుని సేవలో స్వచ్ఛంద సేవలు చేయాలని ఉందని చెప్పారు. దీంతో ఈఓ విజ్ఞప్తిపై 2005వ సంవత్సరంలో టీటీడీ ప్రాజెక్ట్సు కోఆర్డినేటర్‌గా చేరారు. శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు సమన్వయకర్తగా అయిదేళ్లు పనిచేశాను. అప్పుడే భక్తి ఛానల్ పనులు పర్యవేక్షించారు
తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానంపై  2005-07 మధ్య శ్రీ వేంకటేశ్వర దృశ్య శ్ర వణ ప్రాజెక్టు కో ఆర్డినేటరుగానూ, 2007-10 మధ్య  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్, తిరుపతి  కో ఆర్డినేటరుగానూ వ్యవహరించారు.
 
==వీరి సంతానం==
వీరికి ముగ్గురు పిల్లలు. వీరందరు వివిధ ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు