లయన్ (2016 చిత్రం): కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
→‎కథ: శుద్ధి
పంక్తి 63:
కలకత్తా మహానగరంలో అలాగే తచ్చాడుతున్న సరూను నూర్ అనే మహిళ చూస్తుంది. సరూని తన అపార్ట్ మెంట్ కి తీసుకెళుతుంది. రామ అనే వ్యక్తి సరూని ఇంటికి చేర్చటంలో సహాయం చేస్తాడని చెబుతుంది. కానీ నూర్-రామ లు ఏదో దురుద్దేశ్యంతో ఉన్నారని అర్థం చేసుకొన్న సరూ, నూర్ వెంటబడుతున్నా, అక్కడి నుండి పారిపోతాడు. దీనావస్థలో హౌరా బ్రిడ్జి పరిసర ప్రాంతాలలో కాలం వెళ్ళదీస్తున్న సరూ ను రెస్టారెంటు కిటికీ గుండా చూసిన ఒక యువకుడు సరూ ను పోలీసులకు అప్పగిస్తాడు. సరూ మూలాలు తేల్చలేని వారు, అతనిని ఒక అనాథ శరణాలయంలో చేరుస్తారు. మూడు నెలల తర్వాత శ్రీమతి సూద్ (దీప్తి నావల్) సరూ గురించి పత్రికలలో ప్రకటనలు వేయించిందని, కానీ దానికి ఎటువంటి జవాబు రాలేదని సరూకి తెలుపుతుంది. ఒక ఆస్ట్రేలియన్ జంట మాత్రం సరూని దత్తత తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారని తెలుపుతుంది. సరూ కి చిన్న చిన్న ఇంగ్లీషు పదాలు నేర్పుతుంది. 1987 లో శ్రీమతి సూద్, సరూని [[టాస్మేనియా]] కు చెందిన హోబార్ట్ లో నివాసం ఉంటున్న జాన్ బ్రేయిర్లీ మరియు స్యూ ([[నైకోల్ కిడ్మాన్]]) ల వద్దకు పంపుతుంది. సరూ వారి వద్ద సుఖ సంతోషాల మధ్య పెరుగుతూ ఉంటాడు. ఒక సంవత్సరం తర్వాత మంతోష్ అనే మరో భారతీయ బాలుడిని వారు సంతతిగా తెచ్చుకొంటారు. కానీ మంతోష్ క్రొత్త చోటుకు అలవాటు పడలేక విపరీతమైన మానసిక ధోరణి మరియు స్వీయ హానికి పాల్పడటం వంటివి చేస్తుంటాడు.
 
20 ఏళ్ళ తర్వాత యువకుడిగా ఎదిగిన సరూ హోటాల్ మేనేజ్ మెంట్ చదవటానికి [[మెల్బోర్న్]] వెళతాడు. అమెరికన్ విద్యార్థిని అయిన లూసీతో ప్రేమలో పడతాడు. అక్కడి భారతీయ విద్యార్థులతో చేసే విందులో సరూ కి జిలేబీ కనబడుతుంది. జిలేబీ సరూని జ్ఙాపకాల దొంతర్లలోకి నెట్టుతుంది. కలవరపడ్డ సరూని స్నేహితులు అడగగా, తన గతం గురించి వారికి చెబుతాడు. స్నేహితులందరూ అతనిని గూగుల్ ఎర్త్ (Google Earth) గురించి చెబుతారు. దానిని ఉపయోగించి అతని పుట్టిన ప్రదేశం గురించి వెదకమని సలహా ఇస్తారు. సరూ గూగుల్ ఎర్త్ లో తన అన్వేషణ ను మొదలు పెడతాడు. 80వ దశకంలో భారతీయ రైళ్ళు ఎంత వేగంతో నడిచేవి, కలకత్తా కు ఏయే ప్రదేశాల నుండి రైళ్ళు వచ్చేవి, ఇత్యాది వివరాలన్నీ సేకరించి, ఏయే ప్రదేశాలు తన పుట్టిన ఊరుస్వస్థలం అయ్యి ఉండవచ్చునో మ్యాప్ తయారు చేసుకొంటాడు. ఈ అన్వేషణలో అడుగడుగునా తన కుటుంబం తనను కోల్పోయినందుకు ఎంతగా బాధపడుబాధపడి ఉంటుందో తలచుకొంటూతలచుకొని మానసిక వేదనకు గురి అవుతూ ఉంటాడు. ఈ సతమమ మానసిక స్థితిలో ప్రియురాలు లూసీ తో కూడా సంబంధాలు తెంచుకొంటాడు.
 
పెంపుడు తల్లి స్యూ ఆరోగ్యం క్షీణించగా సరూ తన వద్దకు వెళతాడు. తాను గొడ్రాలిని కానని, ఈ ప్రపంచంలో చాలా మంది అనాథలు ఉన్నారని, తన వంతుగా కొంతైనా వారి బాధను తీర్చుదామని మాత్రమే తాను వారివిరునీవారిరువురినీ దత్తత తీసుకొందని సరూ కు తెలుపుతుంది స్యూ. స్యూ వద్దనే కాలం గడుపుతున్న సరూకు మాత్రం తన మూలాల అన్వేషణ లో ఎటువంటి ఫలితం కనబడదు. ఒక సాయంత్రం మాత్రం తన తల్లి రాళ్ళు కొట్టిన ప్రదేశం సరూకు గూగుల్ ఎర్త్ లో కనబడుతుంది. అక్కడికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషను, ఆ స్టేషను లో ఉండే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు తన జ్ఙాపకాలతో సరిపోలటంతో గణేష్ తలై ఎక్కడ ఉందో సరూ కనిపెడతాడు. స్యూ కు విషయం తెలుపగా, విశాల హృదయం కలిగినదృక్పథంతో ఆమె అతని ప్రయత్నాలకు పూర్తి మద్దతు తెలుపుతుంది.
 
సరూ భారతదేశం బయలుదేరి ఎట్టకేలకు తాను పుట్టిన ప్రదేశం చేరుకొంటాడు. అక్కడ ఇంగ్లీషు మాట్లాడగలిగే ఒక వ్యక్తి తో అతని తల్లి, సోదరిని అక్కున చేర్చుకొని భావోద్రేకాలకు గురి అవుతాడు. తాను తప్పిపోయిన రోజే గుడ్డు ప్రమాదవశాత్తు రైలు క్రింద పడి చనిపోయాడని తెలుసుకొని బాధపడతాడు. ఏ నాటికి అయినా సరూ తిరిగి వస్తాడనే ఆశ తోనే తాను ఈ ఊరి వదిలి వెళ్ళలేదని సరూ తల్లి అతనితో చెబుతుంది. ఫిబ్రవరి 2012 లో నిజజీవితం లో సరూ తన కుటుంబాన్ని చేరుకొన్న వీడియో, సరూ తన పెంఫుడు తల్లిదండ్రులను తన అసలు తల్లికి పరిచయం చేసే వీడియో, అసలు తల్లి పెంపుడు తల్లి కి సరూను చక్కగా చూసుకొన్నందుకు ధన్యవాదాలు తెలిపే వీడియో లతో చిత్రం ముగుస్తుంది. సరూ అని అప్పటి వరకూ అనుకొన్న తన అసలు పేరు '''షేరూ '''' అని తెలుసుకొంటాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లయన్_(2016_చిత్రం)" నుండి వెలికితీశారు