షకలక శంకర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== కెరీర్ ==
హైదరాబాదుకు వచ్చిన కొత్తల్లో తన [[స్నేహితులు|స్నేహితుల]] దగ్గర ఉంటూ నాలుగేళ్ల పాటు పెయింటింగ్ పనులు చేశాడు. తరువాత ప్రముఖ నటి [[నిర్మలమ్మ]] వద్ద కొద్ది రోజులు పనిచేశాడు. అప్పుడే అతనికి సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. కొద్దొ రోజులు ఆఫీస్ బాయ్ గా, ప్రొడక్షన్ బాయ్ గా పనిచేశాడు. రన్ రాజా రన్ సినిమా దర్శకుడు శంకర్ కు తను తీసిన ఓ లఘుచిత్రంలో అవకాశం ఇచ్చాడు.<ref name=sakshi/> తరువాత ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో చలాకీ చంటి బృందంలో సభ్యుడిగా ప్రవేశించాడు. తరువాత ''షకలక శంకర్'' పేరుతో తనే సొంతంగా ఓ బృందం కూడా నడిపాడు. ప్రముఖ రాం గోపాల్ వర్మ ను అనుకరించడం, తనదైన [[శ్రీకాకుళం]] యాసతో, [[పవన్ కళ్యాణ్|పవన్ కల్యాణ్]] అభిమానిగా ఓ పాటను పాడటం లాంటి విలక్షణ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తరువాత వరుసగా సినిమా అవకాశాలు వస్తుండటంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/షకలక_శంకర్" నుండి వెలికితీశారు