మాతృదేవోభవ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
starring = [[నాజర్]],<br>[[మాధవి]],<br>[[చారుహాసన్]],<br>[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]],<br>[[వై. విజయ]]|
}}
'''మాతృదేవోభవ''' కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో [[1993]] లో విడుదలై పలువురి మన్ననలు పొందిన ఒక సినిమా. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె. ఎస్. రామారావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, కీరవాణి పాటలు పాడారు. ఈ చిత్రానికి మూలం సిబి మలయిల్ దర్శకత్వంలో వచ్చిన మలయాళం సినిమా ''[[:ml:ആകാശദൂത്|ఆకాశదూతు]]''. ఇదే సినిమాని కన్నడ భాషలో ''[[:kn:ಕರುಳಿನ ಕೂಗು|కరుళిన కూగు]]''(1994) పేరుతోను, హిందీ భాషలో ''[[:en:Tulsi (film)|తులసి]]''(2008) పేరుతోను, మరాఠీ భాషలో ''చిమని పఖరే''(2003) పేరుతోను పునర్మించారు. అయితే ఈ సినిమాలన్నీ 1983లో విడుదలైన అమెరికన్ సినిమా [[:en:Who Will Love My Children?|హూ విల్ లవ్ మై చిల్డ్రన్?]] ఆధారంగా నిర్మించబడ్డాయని భావిస్తున్నారు.
 
 
ఈ చిత్రంలో [[వేటూరి సుందర్రామ్మూర్తి]] రాసిన ''రాలిపొయ్యే పువ్వా నీకు...'' అనే పాటకు జాతీయ పురస్కారం లభించింది. తెలుగు సినిమా పాటకు ఈ అవార్డు దక్కడం ఇది రెండవ సారి. మొదటిసారి [[శ్రీ శ్రీ]] కి "తెలుగువీర లేవరా" పాటకు గాను ఈ అవార్డు 1974లో లభించింది.
"https://te.wikipedia.org/wiki/మాతృదేవోభవ" నుండి వెలికితీశారు