గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి మండల ప్రజాపరిషత్ సంబంధిత భాగాన్ని ప్రత్యేక వ్యాసంలోనికి తరలించు
పంక్తి 371:
ఈ నిధులను కేవలం మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకు మాత్రమే వినియోగించాలనే నిబంధన వల్ల చాలా గ్రామాల్లో రహదార్లు, డ్రెయిన్ల పనులు నిలిచిపోయాయి.గతంలో మార్కెటింగ్ నిధులతో రహదారులు నిర్మించినప్పటికీ గడిచిన 8 ఏళ్లుగా ఆ పనులకు ప్రభుత్వం అంగీకరించలేదు. మరోపక్క స్థానిక నిధులతో సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ సామగ్రి తదితర అవసరాలు తీరుతున్నాయి. ఈ దశలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధులను నేరుగా పంచాయతీలకు అందివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.
 
== '''మండల పరిషత్''' ==
 
* పంచాయతీరాజ్ వ్యవస్థలో మాధ్యమిక వ్యవస్థ మండల పరిషత్
* ఒక మండలాన్ని ఎంపీటీసీలుగా విభజిస్తారు.
 
=='''ఎం.పీ.టీ.సీ - మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం'''==
 
* 3000 - 4000 జనాభా నివసించే గ్రామీణ ప్రాంతాలను కలిపి ఒక ఎంపీటీసీగా ఏర్పాటు చేస్తారు.
* మండల పరిషత్‌లో కనిష్ఠ ఎంపీటీసీల సంఖ్య 7, గరిష్ఠ ఎంపీటీసీల సంఖ్య 23.
* ఎంపీటీసీలు పార్టీ ప్రాతిపదికపై ఎన్నికవుతారు.
* సార్వత్రిక వయోజన ఓటుహక్కు ప్రాతిపదికపై ఎన్నికవుతారు. ఎంపీటీసీలుగా పోటీచేయడానికి ఆ మండల పరిధిలో ఓటరై ఉండాలి.
* సాధారణ అభ్యర్థులు రూ. 2500, ఎస్సీ, ఎస్టీలు రూ. 1250 డిపాజిట్‌గా చెల్లించాలి.
* ఎంపీటీసీగా పోటీచేసే అభ్యర్థి వ్యయపరిమితి రూ. లక్ష.
* ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో గెలుపొందినవారు ప్రమాణం చేస్తారు.
* ఎంపీడీవో సమక్షంలో ఎంపీపీ ప్రమాణం చేస్తారు.
* ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
* ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను జిల్లాస్థాయిలో జనాభా ప్రాతిపదికపై నిర్ణయిస్తారు.
* మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. వీరిని ఎన్నుకునేటప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటుహక్కు ఉండదు.
* వైస్ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు వర్తించవు.
* పరిషత్ సమావేశాలకు చైర్మన్ అధ్యక్షుడు. చైర్మన్ లేకపోతే వైస్ చైర్మన్ అధ్యక్షుడు.
* ప్రతి 30 రోజులకోసారి తప్పనిసరిగా సమావేశమవ్వాలి. సమావేశాల నిర్వహణకు కోరం సభ్యులు 1/3వ వంతు అవసరం. కోరం సభ్యుల కోరిక మేరకు ప్రత్యేకంగా సమావేశం కావచ్చు.
* చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు నిరాకరిస్తే జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి ఆదేశానుసారం ప్రత్యేక సమావేశం నిర్వహించాలి.
* ఈ సమావేశాల్లో చేసే తీర్మానాలకు చట్టబద్ధత ఉంటుంది. మండల పరిషత్‌కు ఒక మైనార్టీ సభ్యుడిని కో ఆప్ట్ చేసుకునే అధికారముంది.
* మండల పరిషత్ సమావేశాలకు మండలంలోని సర్పంచ్‌లు, కలెక్టర్ శాశ్వత ఆహ్వానితులుగా హాజరుకావచ్చు.
* ఎమ్మెల్యే, లోక్‌సభ సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరుకావచ్చు.
* ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరుకావచ్చు.
* చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో కేవలం ఎంపీటీసీలు మాత్రమే పాల్గొంటారు. మిగతావారికి అవకాశం లేదు. ఏదైనా ప్రత్యేక అంశంపై చర్చ జరిగేటప్పుడు ఆ రంగంలో నిష్ణాతులైన ప్రముఖులను సమావేశాలకు హాజరుకావాలని ఎంపీపీ కోరవచ్చు.
* చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక బహిరంగ ఓటు విధానం ద్వారా అంటే చేతులెత్తడం ద్వారా జరుగుతుంది.
* ఎన్నికలో బలాబలాలు సమానమైతే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
* ఎంపీపీల గౌరవ వేతనం తెలంగాణలో రూ. 10,000, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6,000
* ఎంపీటీసీల గౌరవ వేతనం తెలంగాణలో రూ. 5000, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 3,000
* సమావేశాల సందర్భంగా, ఇతర విధుల్ని నిర్వర్తించేటప్పుడు టీఏ, డీఏలు అదనం
* ఎంపీపీ జిల్లా పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు. మండల విద్యా కమిటీకి ఎంపీపీ అధ్యక్షత వహిస్తారు. పరిషత్ సమావేశాల్లో నియమనిబంధనలను ధిక్కరించిన సభ్యులపై ఎంపీపీ చర్య తీసుకోవచ్చు (4 నెలలు సస్పెండ్ చేయవచ్చు).
* చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. వారి పదవీకాలంలో ఒకసారి మాత్రమే ఈ తీర్మానం ప్రవేశపెట్టవచ్చు.
* మండల పరిషత్‌లో విప్ వర్తిస్తుంది.
* పార్టీ గుర్తుపై ఎన్నికయినందున ఒక పార్టీ తరఫున గెలుపొందినవారు ఆ పార్టీ జారీచేసే విప్‌నకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారి వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు.
* అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 2/3వ వంతు సభ్యుల సంతకాలతో ఆర్డీవోకు నోటీసును అందజేయాలి.
* నెలరోజుల్లోగా ఆర్డీవో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ మంది సమావేశానికి హాజరుకావాలి.
* సాధారణ మెజార్టీతో చైర్మన్, వైస్ చైర్మన్లను తొలగించవచ్చు. వరుసగా 3 సమావేశాలు కోరం లేకుండా వాయిదా వేసినట్లయితే ఆ తీర్మానం వీగిపోయినట్టే.
* మండల పరిషత్‌కు పన్నులు విధించే అధికారం లేదు.
* జిల్లా పరిషత్, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులను వినియోగిస్తుంది. అభివృద్ధిలో ఒక యూనిట్‌గా గ్రామాల మధ్య సమన్వయానికి కృషిచేస్తుంది.
 
== ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు