సర్పంచి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==ఎన్నిక==
సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. సర్పంచ్‌ పదవీ కాలం ఐదేళ్లు. సర్పంచ్‌గా పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు జిల్లా ప్రాతిపదికన ఉంది. ఈ స్థానాలు ప్రతి సాధారణ ఎన్నికకు మారుతూ వుంటాయి.. గ్రామ పంచాయతీ ఎన్నికలలో [[రాజకీయ పార్టీ]] అభ్యర్థులు వుండరు. [[రాష్ట్ర ఎన్నికల కమీషన్]] ఎన్నికలు నిర్వహిస్తుంది. ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించటానికి, ప్రభుత్వం పంచాయతీకి నగదు బహుమానం ఇస్తుంది.
సర్పంచులను ఎంపిక చేసేటప్పుడు ప్రభుత్వం స్థానిక ప్రజలకు తెలిసేలా ఒక ప్రకటన విడుదల చేస్తుంది. కొన్ని స్థానాలను [[భారతదేశంలో రిజర్వేషన్|రిజర్వేషన్]] ప్రకారం కేటాయిస్తారు, ఈ స్థానాలలో సర్పంచి పదవికి రిజర్వేషన్ ఉన్నవారు మాత్రమే పోటీ చేయవలసి ఉంటుంది.
 
సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అయితే అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడిన సర్పంచ్‌ను జిల్లా కలెక్టర్‌ తొలగిస్తారు. గ్రామసభ సమావేశాలను ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు నిర్వహించకపోతే సర్పంచ్‌ తన పదవిని కోల్పోతారు. గ్రామ పంచాయతీ ఆడిట్‌ పూర్తి చేయనప్పుడు కూడా పదవిని కోల్పోతారు. సర్పంచ్‌ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీసు ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించడానికి వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించవచ్చు. ఏదైనా కారణం వల్ల సర్పంచ్‌ పదవి ఖాళీ అయితే నాలుగు నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
 
 
* సర్పంచ్‌లకు తెలంగాణలో రూ. 5000, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 3000 గౌరవ వేతనం లభిస్తుంది.
* రాజీనామా పత్రాన్ని జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారికి అందివ్వాలి.
* సర్పంచ్‌లను అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించలేరు.
* సర్పంచ్ పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయితే 4 నెలల్లోగా తిరిగి ఎన్నిక నిర్వహించాలి.
* ఒకవేళ పదవీకాలం 6 నెలల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఉపఎన్నిక అవసరం లేదు.
* సర్పంచ్‌లు ఖర్చుల ఆడిట్ నివేదికను సమర్పించనప్పుడు, చెక్ పవర్‌ను దుర్వినియోగం చేసిన సందర్భాల్లో, సమావేశాలు నిర్వహించని సందర్భాల్లో వారిని కలెక్టర్ సస్పెండ్ చేయవచ్చు.
* పంచాయతీరాజ్ శాఖ విచారణలో అవకతవకలు నిరూపణ అయితే వారిని తొలగించే ఉత్తర్వులు కలెక్టర్ జారీచేస్తారు.
* గ్రామాధికారి సహకారంతో గ్రామపంచాయతీ ఎజెండాను సర్పంచ్ రూపొందిస్తారు. పంచాయతీ తీర్మానాలను అమలుచేయడంలో సర్పంచే కీలక ప్రాత్రధారి.
 
* పంచాయతీ తీర్మానాలను పంచాయతీరాజ్ శాఖకు గ్రామాధికారి పంచాయతీ కార్యదర్శికి పంపిస్తారు.
* సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారి ఆదేశాల మేరకు గ్రామ పాలనా బాధ్యతలను వీడీవో లేదా పంచాయతీ కార్యదర్శి నిర్వహిస్తారు.
* పంచాయతీరాజ్ వ్యవస్థలో 3 స్థాయిల్లోని సంస్థల్లో పన్నులు వేసే అధికారం కేవలం పంచాయతీకే ఉన్నది.
* ఎన్నికలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం శిక్ష విధిస్తే ఆ వ్యక్తి శిక్ష విధించిన రోజు నుంచి ఆరేండ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయరాదు
 
==అర్హతలు==
గ్రామ పంచాయితికి పోటీ చేసే వ్యక్తి అదే పంచాయితిలో ఓటు హక్కును కలిగి ఉండాలి. 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇద్దరు బిడ్డలు కన్నా ఎక్కువ ఉండకూడదు.గ్రామ పంచాయతికి సర్పంచితో పాటు ఎన్నుకోబడిన మెంబర్లలో ఒకరిని ఉపసర్పంచిగా ఎన్నుకుంటారు, ఉపసర్పంచిని మెజారిటీ పరంగా మెంబర్లే ఎన్నుకుంటారు, ఉపసర్పంచి పదవికి పోటీ పడిన అభ్యుర్థులలో ఎవరికి స్పష్టమైన మెజారిటీ లేని పక్షంలో వారిలో ఒకరిని ఉపసర్పంచిగా సర్పంచి ఎన్నుకుంటారు.రిజర్వేషన్ కేటాయించిన స్థానాలలో, రిజర్వేషన్ ఉన్నవారు ఎవరు లేనట్లయితే, లేక రిజర్వేషన్ ఉన్నా వారు సర్పంచి పదవికి పోటీ చేయనట్లయితే ఉప సర్పంచిగా ఎన్నుకోబడిన వ్యక్తే సర్పంచిగా (ఇన్‌ఛార్జి సర్పంచిగా) బాధ్యతలు స్వీకరిస్తారు.
 
 
 
 
.
 
==అధికారాలు==
 
* ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ.
* గ్రామ పంచాయతి సమావేశాలకు అధ్యక్షత.
* గ్రామ పంచాయతి నిర్ణయాల అమలు.
* గ్రామ కార్యనిర్వహణాధికారి/ కార్యదర్శి పని పర్యవేక్షణ.
* గ్రామాభివృద్ధి అధికారి నుండి కావలసిన సమాచారం సేకరణ, సభ్యుల అనర్హతను, ఖాళీలను [[జిల్లా పరిషత్]] అధికారులకు తెలియచేయుట.
* మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సర్పంచి" నుండి వెలికితీశారు