"రోజా సెల్వమణి" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (clean up, replaced: బాలకృష్ణబాలకృష్ణ)
 
==జీవిత విశేషాలు==
[[చిత్తూరు]] జిల్లా, [[చిన్నగొట్టిగల్లు]] మండలం [[భాకరాపేట]]కు చెందిన రోజా [[తిరుపతి]] పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004,2009 [[శాసనసభ]] ఎన్నికలలో[[నగరి]], [[చంద్రగిరి]] నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 [[శాసనసభ]] ఎన్నికలలో[[నగరి]] నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు.
 
రోజా మొదట తమిళచిత్రంలో నటించింది. ఆ సినిమాను ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్‌కే సెల్వమణి రూపొందించాడు. ‘చంబరతి’ పేరుతో విడుదలైన ఆ చిత్రంలో హీరో ప్రశాంత్‌.
 
== నట జీవితం ==
రోజా తెలుగు చిత్రాలతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. డాక్టర్‌ శివప్రసాద్‌ ప్రోత్సాహంతో [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]] సరసన [[ప్రేమ తపస్సు]] సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత [[చిరంజీవి]], [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[నాగార్జున]], [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తరువాత, సినీ నిర్మాతగా కూడా మారారు.
 
తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్.కె.సెల్వమణి గారు [[చామంతి|చెంబరుతి]] చిత్రం ద్వారా పరిచయం చేశారు, ఈ చిత్రంలో [[ప్రశాంత్]] కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో రోజా మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నరు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా జబర్దస్త్ ([[ఈటీవీ|ఈ టీవి]]) , బతుకు జట్కబండి (జీ తెలుగు) , రంగస్థలం ([[జెమినీ టీవీ|జెమిని టి.వి]]) వంటి కర్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ దూసుకెల్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3119452" నుండి వెలికితీశారు