గుండమ్మ కథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
writer =[[పింగళి నాగేంద్రరావు]]|
dialogues =[[డి.వి.నరసరాజు]] |
starring = [[నందమూరి తారక రామారావు]] ,
[[అక్కినేని నాగేశ్వరరావు]] ,
[[సావిత్రి]],
[[అల్లు రామలింగయ్య ]] ,
[[జమున]] ,
[[ఎస్.వి.రంగారావు]] ,
[[సూర్యకాంతం]] ,
[[ఛాయాదేవి]] ,
[[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]] , [[హేమలత]] ,
[[హరనాథ్]] ,
[[ఎల్ విజయలక్ష్మి]] ,
[[ముక్కామల కృష్ణమూర్తి|ముక్కామల]],
[[ఋష్యేంద్రమణి]] ,
[[రాజనాల]]|
director = [[కమలాకర కామేశ్వరరావు]] |
producer =[[బి.నాగిరెడ్డి]] , [[చక్రపాణి]]|
పంక్తి 27:

==ఇతివృత్తం==
గుండమ్మ ([[సూర్యకాంతం]]) భర్త చనిపోయిన ఇల్లాలు, ఆమెకు గయ్యాళిగా ఊళ్ళో పేరుంటుంది. ఆమె సవతి కూతురు లక్ష్మి ([[సావిత్రి (నటి)|సావిత్రి]]), స్వంత కూతురు సరోజ ([[జమున (నటి)|జమున]]), కొడుకు ([[హరనాథ్]]) ఉంటారు. ఇంటి చాకిరి మొత్తం లక్ష్మి మీద పడితే, సరోజ మాత్రం ఏ పనిపాటలూ రాకుండా పెంకెగా తయారవుతుంది. లక్ష్మికి ఎవరైనా వెనుకా ముందు లేని పనివాడికి ఇచ్చి చేసి ఇంట్లో శాశ్వతంగా ఇద్దరినీ పనివాళ్ళలా ఉంచాలని, సరోజకు బాగా డబ్బున్న, చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్ళిచేసి ఇల్లరికం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన. సరోజకు గుండమ్మ పెళ్ళిచేయాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె తమ్ముడు వరసయ్యే గంటయ్య ([[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]]) పెళ్ళి చెడగొడతూంటాడు. ఎలాగైనా హత్యచేసి జైల్లో ఉన్న తన కొడుకు ([[రాజనాల]]) విడుదలయ్యాకా అతనికి ఇచ్చి చేయాలని అతని పథకం.

పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక జమీందారు రామభద్రయ్య ([[ఎస్.వి.రంగారావు]]) ఇద్దరు కొడుకులకు, గుండమ్మ ఇద్దరు కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేయవచ్చునన్న సంబంధం వస్తుంది. రామభద్రయ్య చనిపోయిన తన స్నేహితుడి కుటుంబమేనని తెలియడంతో, పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వచ్చి అ యింటి పరిస్థితి అర్థం చేసుకొంటాడు. లక్ష్మిని పెద్ద కొడుక్కి చేసుకోవాలంటే గుండమ్మ ఒప్పుకోదనీ, మరోవైపు సరోజకున్న పెంకెతనం, బద్ధకం తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని పిల్ల మాత్రం మంచిదేనని అంచనా వేస్తాడు. ఇలా ఇద్దరూ తన కొడుకులకు సరిపోయే పెళ్ళికూతుళ్ళే అయినా గుండమ్మ, గంటయ్య ఈ పెళ్ళిళ్ళు పడనివ్వరన్న ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్ ([[ఎన్.టి.రామారావు]]), రాజా ([[అక్కినేని నాగేశ్వరరావు]])లను పిలిచి పరిస్థితులు వివరిస్తాడు. పథకం ప్రకారం పెద్దకొడుకు ఆంజనేయప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని మంచి మనసున్నవాడిగా ఆకర్షిస్తాడు. గుండమ్మకు కొడుకు ([[హరనాథ్]]), ప్రేమిస్తున్న అమ్మాయి([[ఎల్.విజయలక్ష్మి]])కి అన్నయ్యగా రాజా ప్రవేశించి, సరోజను ఆకట్టుకుంటాడు.
"https://te.wikipedia.org/wiki/గుండమ్మ_కథ" నుండి వెలికితీశారు