అంటువ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పంక్తి 18:
==పేర్లు, అర్థాలు==
 
ఇంగ్లీషులో ఇన్ఫెక్షస్, కంటేజియస్ (infectious, contagious) అని రెండు మాటలు ఉన్నాయి. వీటి అర్థంలో పోలిక ఉంది కానీ ఈ రెండూ రెండు విభిన్నమైన భావాలని చెబుతాయి. ఒక ప్రియాను (prion) వల్ల కాని, [[వైరస్]] (virus) వల్ల కాని, [[బేక్టీరియం]] (bacterium) వల్ల కాని, [[ఫంగస్]] (fungus) వల్ల కాని, [[పేరసైట్]] (parasite) వల్ల కాని వచ్చే రోగాలని “ఇన్ఫెక్షస్ డిసీజెస్” (infectious diseases) అంటారు. అంటే, మన శరీరానికి “స్వంతం” కాని లాతి పదార్ధాలు శరీరంలోకి ప్రవేశించి రోగకారకులు అయినప్పుడు “ఇన్ఫెక్షన్” (infection) అన్న మాట వాడతాం. ఒక జీవి నుండి మరొక జీవికి అంటుకునే రోగాలని “కంటేజియస్ డిసీజెస్” (contagious diseases) అని కాని, “కమ్యూనికబుల్ డిసీజెస్” (communicable diseases) అని కాని, “ట్రాన్స్ మిసిబుల్ డిసీజెస్” (transmissible diseases) అని కాని అంటారుఅంkటారు.
 
“సి. జె. డి.” (CJD) అనే జబ్బు ఉంది. ఇది ప్రియానులు మన శరీరంలో జొరబడ్డం వల్ల వస్తుంది. కాని ఇది ఒకరి నుండి మరొకరికి అంటుకోదు. అంటే ఈ “సి. జె. డి.” (CJD) జబ్బుతో తీసుకుంటూన్న వ్యక్తి దరిదాపుల్లోకి వెళ్లినంత మాత్రాన ఆ జబ్బు మనకి అంటుకోదు. కనుక ఇది “ఇన్ఫెక్షస్ డిసీజ్” (infectious disease) మాత్రమే. దోమకాటు వల్ల మనకి సంక్రమించే మలేరియా వంటి రోగం కూడా “ఇన్ఫెక్షస్ డిసీజ్” కోవకే చెందుతుంది.
 
కాని మలేరియా కేవలం ఒకరిలో తిష్ట వేసుకుని ఉండిపోదు కదా. మలేరియా ఉన్న రోగిని కరిచిన దోమ మరొకరిని కరిస్తే ఆ రెండవ వ్యక్తికి మలేరియా వచ్చే సావకాశం ఉంది. ఈ దృష్టితో చూస్తే మలేరియాని “కంటేజియస్”(contagious) అని అనుకోవచ్చు. ఈ వ్యత్యాసం ఇన్^ఫ్లుయెంజా విషయంలో స్పుటంగా కనిపిస్తుంది. ఇన్^ఫ్లుయెంజా లేదా ఫ్లు (influenza or flu) ఇన్ఫెక్షస్ మాత్రమే కాకుండా కంటేజియస్ కూడా! ఎందుకంటే ఒకరికి ఫ్లూ వస్తే వారికి సమీపంలో ఉన్న మరొకరికి గాని, వారిని తాకిన వారికి గాని అంటుకునే సావకాశం బాగా ఉంది. కనుక ఈ రెండు రకాల రోగాల మధ్య ఒక గీత గీసి ఒక పక్క ఇన్ఫెక్షస్ మరొక పక్క కంటేజియస్ అని నిర్ద్వందంగా చెప్పటం కొంచెం కష్టం.
 
==తిష్ట వ్యాధులు==
"https://te.wikipedia.org/wiki/అంటువ్యాధి" నుండి వెలికితీశారు