దార అప్పలనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననం: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 45:
1964 లో శృంగవరపు కోటలో అప్పటి [[ముఖ్యమంత్రి]] [[కాసు బ్రహ్మానందరెడ్డి]] సమక్షాన 'చైనా భూతం' ప్రదర్శించాడు. 1975 లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బుర్రకథను ప్రదర్శించాడు. 1984 లో మహానాడులో 'రామరాజ్యం' బుర్రకథను రక్తికట్టించి, అప్పటి ముఖ్యమంత్రి [[ఎన్.టి.రామారావు]] అభినందనలు అందుకున్నాడు. ఈయన కథాగానం గ్రామఫోన్ రికార్డులుగా కూడా విడుదలైంది. 'లాల్ బహదూర్ శాస్త్రి', 'కొళాయి-లడాయి', 'ఎన్నికలు కామిక్' వంటి కథలు ఈ రికార్డులో ఉన్నాయి.
 
1967 లో తెలుగు సినిమా రంగంలో కాలుపెట్టి, [[కాంభోజరాజు కథ]], [[కన్యకా పరమేశ్వరి కథ]], [[రైతుబిడ్డ]], [[శభాష్ పాపన్న]] చిత్రాల్లో బుర్రకథ కళాకరునిగానే కనిపించి, వినిపించాడు. [[ఆకాశవాణి]], [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] లలో వివిధసమయాలలో కథాగానం చేశాడు.
 
ఈయన 'హాస్య నటనాధురీణ' బిరుదాంకితుడు. 1966 లో [[భీమవరం]] త్యాగరాజు ఆరాధనోత్సవాలలో స్వర్ణ సింహతలాటాలు, కరకంకణాలు బహుమతిగా పొందాడు. 1988 జూన్ 27న ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఆధ్వర్యంలో '[[కళాప్రపూర్ణ]]' గౌరవం అందుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/దార_అప్పలనారాయణ" నుండి వెలికితీశారు