జ్వాలాముఖి (రచయిత): కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
==వ్యక్తిగత జీవితం==
[[మెదక్ జిల్లా]] [[ఆకారం]] గ్రామంలో [[1938]] [[ఏప్రిల్ 12]] న జన్మించిన ఆయన అసలు పేరు '''వీరవెల్లి రాఘవాచార్య'''. తల్లిదండ్రులు నరసింహాచార్యులు, వెంకటలక్ష్మీనర్సమ్మ. [[హైదరాబాదు|హైదరాబాదు‌]]లోని [[మల్లేపల్లి (ఆసిఫ్‌నగర్ మండలం)|మల్లేపల్లి]], [[నిజాం కళాశాల]]లో విద్యాభాస్యాన్ని పూర్తి చేసుకున్న ఆయన నిజాం కళాశాలలో ఎల్.ఎల్‌.బీ. పూర్తిచేశాడు. ఉపాధ్యాయుడిగా [[సికింద్రాబాద్]], [[బెంగుళూరు]] సైనిక పాఠశాలల్లో 12 ఏళ్లు విధులు నిర్వహించాడు. తరువాత [[హైదరాబాదు|హైదరాబాదు‌]]లోని ఎల్.ఎన్‌.గుప్తా సైన్స్, కామర్స్ కళాశాలలో24 ఏళ్లు అధ్యాపకుడిగా పనిచేసి 1996లో పదవీ విరమణ చేశాడు. మొదట్లో నాస్తికవాదం, పిదప మానవతా వాదం, అనంతరం మార్కిస్టు ఆలోచన విధానం వైపు మొగ్గు చూపాడు. 1958లో 'మనిషి' దీర్ఘకవితకు గుంటూరు రచయితల సంఘంవారు [[కరుణశ్రీ]] చేతులమీదుగా ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందజేశారు. 1965-70 మధ్య దిగంబర కవుల పేరుతో కవితా సంపుటాలు రాశాడు. ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (ఓ.పీ.డీ.ఆర్) సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు సార్లు [[చైనా]]కు వెళ్లారు. 1971లో విరసం సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద [[నిఖిలేశ్వర్]], [[చెరబండరాజు]]లతో [[ముషీరాబాద్]] జైల్లో యాభై రోజులున్నాడు.<ref>[http://books.google.com/books?id=V1eD4bGpqvMC&pg=PA298 The Wages of Impunity By K. G. Kannabiran పేజీ.298]</ref> 1975 [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] కాలంలో 15 రోజులు జైల్లో ఉన్నారు. ఈయన పై [[మఖ్దూం మొహియుద్దీన్]] ప్రభావం ఉంది. [[డిసెంబరు 14]] [[2008]] న కాలేయ వ్యాధి, గుండెపోటుతో మరణించాడు.
 
==జ్వాలాముఖి రచనలు==
"https://te.wikipedia.org/wiki/జ్వాలాముఖి_(రచయిత)" నుండి వెలికితీశారు