కోలంక వెంకటరాజు: కూర్పుల మధ్య తేడాలు

737 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
'''కోలంక వెంకటరాజు''' మృదంగ విద్యాంసుడు.
==విశేషాలు==
ఇతడు మృదంగ విద్వాంసుల కుటుంబంలో 1910లో జన్మించాడు. ఇతడు మొదట తన పినతండ్రి చినరామస్వామి వద్ద మృదంగం అభ్యసించాడు. తర్వాత [[కాకినాడ]]లో మురమళ్ళ గోపాలస్వామి వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. తన 8వ యేట నుండే ఇతడు అనేక మంది విద్వాంసులకు మృదంగ సహకారాన్ని అందించాడు. [[తుమరాడ సంగమేశ్వరశాస్త్రి]], [[ద్వారం వెంకటస్వామి నాయుడు]],అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]], పల్లడం సంజీవరావు, [[ఈమని శంకరశాస్త్రి]], స్వామినాథ పిళ్ళె,[[హరి నాగభూషణం]], [[పారుపల్లి రామక్రిష్ణయ్య]], మునుగంటి వెంకట్రావు, ఈమని అచ్యుతరామశాస్త్రి, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్, టి.ఆర్.మహాలింగం, [[శ్రీపాద పినాకపాణి]], [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]], టి.కె.జయరామ అయ్యర్, మహరాజపురం విశ్వనాథ అయ్యర్, మధురమణి అయ్యర్, ముదికొండాన్ వెంకట్రామ అయ్యర్, టి.కె.రంగాచారి, [[ఓలేటి వెంకటేశ్వర్లు]], [[నేదునూరి కృష్ణమూర్తి]] వంటి విద్వాంసుల కచేరీలలో మృదంగం వాయించాడు. మద్రాసు, కలకత్తా, బొంబాయి, పూనా, నాగపూర్, బెంగళూరు, హైదరాబాదు, ముజఫర్‌పూరు వంటి దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో, పట్టణాలలో ఇతని కచేరీలు జరిగాయి. అంతే కాక విజయనగరం, బొబ్బిలి, పర్లాకిమిడి, పిఠాపురం, మందస, టెక్కలి, వెంకటగిరి, కసింకోట మొదలైన సంస్థానాలలో ఇతని విద్యా ప్రదర్శన జరిగింది.
 
ఇతడు [[తుని]]లో ఇంటివద్దనే గురుకుల పద్ధతిలో ఎంతో మంది శిష్య ప్రశిష్యులను తయారు చేయడంతో బాటు [[విజయనగరం]] [[మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]], [[హైదరాబాదు]] [[శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]]లలో అనేక మందికి మృదంగాన్ని నేర్పించాడు.
74,503

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3124313" నుండి వెలికితీశారు