ఎయిర్ కండిషనర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==వాయువులు, ఒత్తిడి ప్రభావం==
ఇప్పుడు ఈ పాత్రలో ఉన్న వాయువు మీద [[ఒత్తిడి]] (pressure) పెంచినప్పుడు ఆ వాయువు ఆక్రమించే ప్రదేశం (volume) తగ్గుతుంది. అప్పుడు దానిలోని బణువులు దగ్గరగా జరుగుతాయి. కనుక అవి ఎక్కువ తరచుగా ఒకదానితో మరొకటి ఢీకొనడానికి సావకాశం పెరుగుతుంది. కనుక ఆ వాయువు తాపోగ్రత పెరుగుతుంది. అనగా, ఆ వాయువు వేడెక్కుతుంది. అంటే ఏమిటన్నమాట? ఒక వాయువు మీద ఒత్తిడి పెంచితే అది వేడెక్కుతుంది. ఇదే తర్కంతో ఒక వాయువు మీద అకస్మాత్తుగా ఒత్తిడి తగ్గిస్తే ఆ వాయువు చల్లబడుతుంది. ఈ సూత్రం అర్థం అయితే మిగిలినది నల్లేరు మీద బండి నడక!
 
==దశ మార్పు==
ఇప్పుడు మరొక అంశాన్ని పరిశీలిద్దాం. నీళ్ళని కుంపటి మీద పెట్టి వేడి చేస్తే కొంతసేపటికి నీళ్ళు వేడిని పీల్చుకుని, 100 డిగ్రీలు సెల్సియస్ దగ్గర ఆవిరిగా మారుతాయి. అనగా, ఒక ద్రవపదార్థాన్ని వేడి చేస్తే అది వాయు పదార్థంగా మారుతుంది. దీనిని “దశ మార్పు” (phase conversion) అంటారు. ఆ ఆవిరిని చల్లబరిస్తే మళ్ళా నీళ్ళు వచ్చెస్తాయి. నీళ్ళ కంటె సులభంగా “ఆవిరి” అయే పదార్థాలు ఉన్నాయి. ఉదాహరణకి “ఆల్కహాలు” జాతి ద్రవాలు. నూటికి నూరు శాతం గాఢత ఉన్న ఎతల్ ఆల్కహాలుని (దీనినే కొన్ని సందర్భాలలో “స్పిరిట్” అంటారు) చేతి మీద పోసుకుంటే అది 37 సెల్సియస్ డిగ్రీలు దగ్గర ఉన్న మన శరీరపు వేడిని పీల్చుకుని వాయువుగా మారుతుంది. వేడిని అలా నష్టపోవడం వల్లనే చెయ్యి చల్లగా అయిపోతుంది.
"https://te.wikipedia.org/wiki/ఎయిర్_కండిషనర్" నుండి వెలికితీశారు