ప్రియురాలు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 7:
production_company = భారతలక్ష్మీ ప్రొడక్షన్స్|
music = [[యస్.రాజేశ్వర రావు]]|
starring = [[జగ్గయ్య ]],
[[పువ్వుల లక్ష్మీకాంతం|లక్ష్మీకాంతం]],
[[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]],
[[టి.కనకం]],
[[సావిత్రి]],
[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]],
చంద్రశేఖర్,
[[నల్ల రామమూర్తి]]|

పంక్తి 14:
{{Div col|cols=2}}
* [[పువ్వుల లక్ష్మీకాంతం|లక్ష్మీకాంతం]] - మోహిని
* [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]] - పద్మిని
* [[టి.కనకం]] - రంగసాని
* [[గంగారత్నం]] - శ్రీహరి
పంక్తి 51:
[[ఫైలు:TeluguFilm Priyuralu.jpg|left|thumb|150px|రూపవాణిలో "ప్రియురాలు" చిత్రం ప్రకటన]]

ధనవంతుడైన కోతిగంతుల కోదండం భార్యను, కూతురు సరోజను నిర్లక్ష్యం చేసి వేశ్యల వెంట తిరుగుతూ, శ్రీహరికి డబ్బు ఆశపెట్టి, మోహిని కోసం ఒత్తిడి చేస్తాడు. శ్యామలరావును పద్మిని ప్రేమిస్తుంది. కానీ అతడు అంగీకరించడు. మోహిని తన అక్క, తల్లితో నృత్య ప్రదర్శన ఇవ్వడానికి వెళుతుంటే కారు చెడిపోతుంది. శ్యామలరావు నృత్య ప్రదర్శన ఆగిపోకుండా తన కారులో వారిని తీసుకుపోతాడు. మోహిని నృత్యాన్ని, ఆమె సంస్కారాన్ని చూసి శ్యామ్‌ ఆమెను ప్రేమిస్తాడు.

శ్రీహరి అర్ధరాత్రివేళ కోదండాన్ని మోహిని గదిలోకి పంపుతుంది. మోహిని ఇంట్లోనుంచి పారిపోయి శ్యామలరావును కలుసుకుంటుంది. అతడు ఆమెను తన ప్రాణస్నేహితుడైన విఠల్ రావు ఇంటికి తీసుకుపోతాడు. అతడు వీరిద్దరినీ మద్రాసుకు పంపిస్తాడు.శ్రీహరి, రంగసాని పోలీసు రిపోర్టు ఇచ్చి, మోహిని ఫోటోలు అన్ని చోట్లకూ పంపుతారు.
పంక్తి 57:
శ్యామ్‌, మోహిని మద్రాసులో మారేజి రిజిష్ట్రార్ వద్దకు వెళ్ళగా అతడు ఒక తేదీ నిర్ణయిస్తాడు. ఈలోగా వారు మహాబలిపురం, మైసూరు మొదలైన ప్రదేశాలు చూడడానికి వెళతారు. శ్యామ్‌ ప్రేమోద్వేగంతో ఆమెను వాంఛిస్తాడు. ఆమె లోబడుతుంది. వారు మద్రాసుకు తిరిగివస్తుంటే హఠాత్తుగా కారు ప్రమాదం జరిగి శ్యామ్‌ తీవ్రంగా గాయపడతాడు. అతనికి పూర్వస్మృతి పోతుంది. అక్కడి నుండి తెలిసీ తెలియని స్థితిలో ఎక్కడికో వెళ్ళిపోతాడు. మోహిని హోటల్లో దుఃఖిస్తూ ఉండగా, శ్యామ్‌ కనపడలేదని చెప్పడానికి వచ్చిన పోలీసు ఆమెను గుర్తుపట్టి బలవంతంగా శ్రీహరికి అప్పగిస్తాడు.

కోదండం భార్య జబ్బుతో చనిపోతుంది. రంగసాని వ్యామోహంలో పడిన కోదండం, కూతురు సరోజను మేనమామ ఇంటికి పంపి ఆస్తిని అంతా అమ్మివేసి మద్రాసు వెళ్ళి ఫిలిం కంపెనీ పెడతాడు. శ్యామ్‌ వల్ల మోహిని గర్భవతి అయ్యిందన్న విషయాన్ని గ్రహించిన శ్రీహరి, రంగసాని ఆమెను గర్భస్రావానికి మందు తీసుకొని, వేశ్యావృత్తి చేయమని బలవంతం చేస్తారు. ఆమె లొంగక పోవడంతో ఇంట్లోంచి గెంటివేస్తారు. బికారిగా తిరుగుతున్న శ్యామ్‌ను పద్మిని చేరదీస్తుంది. అతనికి మోహిని జ్ఞాపకం లేదని గ్రహించి, అతడిని ఆకర్షించి వశం చేసుకొంటుంది.

మోహిని వీధులపాలై పడరానిపాట్లు పడుతూ ఒక బిడ్డను ప్రసవిస్తుంది. రేడియోలో శ్యామ్‌ పాటను విని మద్రాసుకు అతడిని వెదుకుకొంటూ వెళుతుంది. శ్యామ్‌ ఆమెను గుర్తుపట్టక నిందిస్తాడు. పద్మిని వెళ్ళగొడుతుంది. ఈ అవమానం భరించలేక ఆమె బిడ్డతో సహా ఆత్మహత్యకు పాలుపడుతుంది. వారిద్దరినీ విఠల్ రావు కాపాడి తన ఆశ్రమంలో చేర్చుకొంటాడు. సరోజకు విఠల్ రావు మీద ఉన్న ప్రేమను మోహిని గ్రహించి వారిద్దరినీ వివాహం చేసుకోమని కోరుతుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రియురాలు" నుండి వెలికితీశారు