కోటయ్య ప్రత్యగాత్మ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 21:
మద్రాసు చేరి, [[తాతినేని ప్రకాశరావు]] వద్ద కథా రచయితగా, సహాయదర్శకుడుగా పనిచేసారు. 1954లో తొలిసారి సమకూర్చిన కథ [[నిరుపేదలు]] చిత్రానికి. ఆ తరువాత [[జయం మనదే]], [[ఇల్లరికం]], చిత్రాలకు కథ సమకూర్చారు. పి.ఎ.పి వారు నిర్మించిన ఇల్లరికం చిత్రానికి సెకండ్‌ యూనిట్‌ డైరక్టర్‌గా 1959లో వ్యవహరించారు.
 
[[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]], [[అక్కినేని]] ప్రధానపాత్రలు పోషించిన [[భార్యాభర్తలు]] చిత్రంతో 1961లో దర్శకుడుగా మారారు. ఇది [[ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌]] పతాకాన నిర్మితమయింది. ఎ.వి.సుబ్బారావు ఈ చిత్ర నిర్మాత. తొలి చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆ తరువాత అక్కినేని హీరోగా పలు చిత్రాలను రూపొందించారు ప్రత్యగాత్మ. భార్యాభర్తలు చిత్రంలో పాటలు కూడా హిట్‌. ఈ చిత్రానికిగాను రజిత కమలం దక్కింది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి చేతులమీదుగా.
 
చక్కని కుటుంబ కథకు, సెంటిమెంట్లు జోడించడం, మంచి డ్రామా పండించగల నేర్పు, హిట్‌ అయ్యే పాటలను ఎంపిక చేయడం అనేవి ప్రత్యగాత్మలోని ప్రత్యేకతలు. సహజంగా ఉన్న ఊహాశక్తి, తాతినేని ప్రకాశరావు వద్ద చేరడంతో మరింత మెరుగులు దిద్దుకుంది. మంచి దర్శకుడుగా ఎదుగుతాడని తొలిదశలోనే తాతినేని ప్రకాశరావు, ఎ.వి.సుబ్బారావులతో పాటు అక్కినేని నాగేశ్వరరావు కూడా తలచారు. తొలి తలపులకు అనుగుణంగానే ఇటు తెలుగు చిత్రసీమలోనూ, అటు హిందీ చిత్రసీమలోనూ రాణించారు ప్రత్యగాత్మ. 1966లో సొంత సినీ నిర్మాణ సంస్థ [[ఆత్మ ఆర్ట్స్]] ప్రారంభించాడు. కులగోత్రాలు, పునర్జన్మ, మనుషులు మమతలు, ఆదర్శకుటుంబం, శ్రీమంతుడు, పల్లెటూరి బావ అక్కినేని హీరోగా ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొంది విజయం సాధించాయి. అమ్మకోసం, ముగ్గురు అమ్మాయిలు, మా వదిన, అత్తవారిల్లు, అల్లుడొచ్చాడు, గడుసు అమ్మాయి, కన్నవారి ఇల్లు, కమలమ్మ కమతం తదితర చిత్రాలు ప్రత్యగాత్మ రూపొందించినవే. 1980లో దర్శకత్వం వహించిన నాయకుడు - వినాయకుడు ఈయన చివరి చిత్రం.
"https://te.wikipedia.org/wiki/కోటయ్య_ప్రత్యగాత్మ" నుండి వెలికితీశారు