గిరిజ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎నేపధ్యము: AWB తో వర్గం చేర్పు
చి clean up, replaced: రేలంగిరేలంగి (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16:
| spouse = సి. సన్యాసిరాజు
}}
'''గిరిజ''' సుప్రసిద్ధ తెలుగు సినీ నటి. నటుడు [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]]తో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది.
 
గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల, సినిమా నటి [[దాసరి రామతిలకం]]. 1936లో కంకిపాడులో పుట్టిన గిరిజ, గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లింది. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపింది. కస్తూరి శివరావుకు ఈమె ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచినా, ఆ సినిమాతో రేలంగి పరిచయమయ్యాడు. ఆయన ప్రయత్నంతోనే పాతాళభైరవిలో అవకాశం వచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. గిరిజ 1950, 60వ దశకంలో హీరో, హీరోయిన్‌లతో సమానంగా గుర్తింపు పొందింది.
పంక్తి 22:
 
==నేపధ్యము==
1950 - 1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. [[కస్తూరి శివరావు]] నిర్మించిన [[పరమానందయ్య శిష్యులు]] చిత్రంతో [[అక్కినేని నాగేశ్వరరావు]] సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత [[పాతాళభైరవి]] చిత్రంలోని 'నరుడా ఏమి నీ కోరిక' అనే ఒకే ఒక్క పలుకుతో కథానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]]తో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. [[అన్నపూర్ణ (సినిమా)|అన్నపూర్ణ]], [[గుడిగంటలు]], [[అప్పుచేసి పప్పుకూడు]], [[జగదేకవీరుని కథ]], [[ఆరాధన]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
 
ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు (వెలుగునీడలు), [[ఎన్. టి. రామారావు]] (మంచి మనసుకు మంచిరోజులు), [[జగ్గయ్య]] (అత్తా ఒకింటి కోడలే), [[శివాజీగణేశన్]] (మనోహర), [[హరనాథ్]] (మా ఇంటి మహాలక్ష్మి), [[చలం]] (కులదైవం), [[జె. వి. రమణమూర్తి]] (ఎం.ఎల్.ఏ) వంటి కథానాయకుల సరసన నాయికగా రాణించింది.
"https://te.wikipedia.org/wiki/గిరిజ_(నటి)" నుండి వెలికితీశారు