ఓగిరాల రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: రేలంగిరేలంగి (2)
పంక్తి 47:
గుణసుందరి కథ చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో ఓగిరాల సంగీతం ఒకటి. [[పి.లీల]], [[టి.జి.కమలాదేవి]], [[కస్తూరి శివరావు]], [[శాంతకుమారి]], [[కె.మాలతి|మాలతి]], [[ఘంటసాల]] తదితరులతో ఓగిరాల పాడించిన పాటలు విశేష జనాదరణ పొందాయి. ఈ చిత్రంలో పాటలన్నీ [[పింగళి నాగేంద్రరావు]] రాశారు. ఓగిరాల [[పి.లీల]] చేత పాడించినవన్నీ భక్తి పాటలే, వాటిలో ''శ్రీ తులసి ప్రియ తులసి'' పాట చాలా కాలం అందరి ఇళ్ళల్లో వినిపించేది, ఆ పాట పాడుతూ ప్రతీ స్త్రీ తులసి మాతను ఆరాధించేది. [[శాంతకుమారి]], [[మాలతి]] కలిసి పాడిన ''కలకలా ఆ కోకిలేమో'', ''చల్లని దొరవేలె చందమామ'' పాటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. [[ఘంటసాల]] ఈ చిత్రంలో ''అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా'' అనే నేపథ్యగీతం పాడారు. అలాగే కస్తూరి శివరావు, [[టి.జి.కమలాదేవి]], వి.శివరాం పాడిన పాటలు కూడా పేరు పొందాయి.
 
పెద్ద మనుషుల చిత్రంలో [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]]కి [[ఘంటసాల]] పాడిన ''నందామయా గురుడ నందామయా'', ''శివశివ మూర్తివి గణనాథా'' బాగా జనాదరణ పొందాయి. ఆ రెండూ పాటలను [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు]] రాశారు. పి.లీల ఈ చిత్రంలో మూడు పాటలు పాడింది, ఆమె పాడిన ''నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ'' పాట హిందీ చిత్రం ''అల్‌బేలా''లోని పాటకు అనుకరణగా సంగీతం అందించారు, లీలనే పాడిన ''అంతభారమైతినా అంధురాలనే దేవ'' పాట మనస్స్సుకు హత్తుకునే విధంగా సంగీతం అందించారు. ఈ చిత్రం జాతీయ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ విధంగా జాతీయ బహుమతి పొందిన మొదటి తెలుగు చిత్రానికి సంగీతమందించిన వ్యక్తిగా ఓగిరాల కీర్తి పొందారు.
 
==మరణం==
పంక్తి 53:
 
==సంతానం==
ఓగిరాలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇద్దరూ తండ్రి ఓగిరాల వద్ద లలిత సంగీతం నేర్చుకున్నా ఆ రంగం వైపు చూడలేదు. ఓగిరాల కుమారుడు నరసింహమూర్తి కార్పొరేషన్ బ్యాంకులో ఉన్నత పదవి నుండి విరమణ పొందారు. నరసింహమూర్తి కొన్ని చిత్రాలలో బాలనటునిగా నటించారు. [[బ్రతుకుతెరువు]] (1953)లో [[సూర్యకాంతం]] కొడుకుగా, [[దొంగ రాముడు (1955 సినిమా)|దొంగరాముడు]] (1955)లో చిన్ననాటి రాముడి స్నేహితునిగా, [[అప్పు చేసి పప్పు కూడు]] (1959)లో [[సూర్యకాంతం]], [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి|రమణారెడ్డి]] కొడుకుగా నటించారు. [[అప్పు చేసి పప్పు కూడు]]లో [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]], నరసింహమూర్తి కలిసి పండించిన హాస్యం మరువలేనిది.
 
==చిత్రసమాహారం==