తుంగల చలపతిరావు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, replaced: రేలంగిరేలంగి
పంక్తి 1:
'''తుంగల చలపతిరావు''', [[రంగస్థలం|రంగస్థల]] నటుడు, తొలితరం [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమా నటుడు. ఈయన, [[కపిలవాయి రామనాథశాస్త్రి]], జొన్నవిత్తుల శేషగిరిరావు, [[దైతా గోపాలం]]లతో కలిసి బెజవాడ నాట్యమండలి పేరు మీద నాటకాలు వేసేవారు.<ref>[http://www.telugucinema.com/c/publish/starsprofile/tribute_pendyala.php సు'స్వరాల' మాల - పెండ్యాల] {{Webarchive|url=https://web.archive.org/web/20101231101049/http://www.telugucinema.com/c/publish/starsprofile/tribute_pendyala.php |date=2010-12-31 }} - తెలుగుసినిమా.కామ్</ref><ref> నారదపాత్రకు జీవం పోసిన 'తుంగల', (నాటకం-అమరావతీయం), డా. [[కందిమళ్ళ సాంబశివరావు]], ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 21 ఆగస్టు 2017, పుట.14</ref>
 
== కళాప్రస్థానం ==
1935లో చలపతిరావు, [[దాసరి కోటిరత్నం]], బి.వి.రామానందంలతో కలిసి ' భారత లక్ష్మి ఫిలిమ్స్ ' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి [[కలకత్తా]]లో [[సతీ సక్కుబాయి]] అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో కోటిరత్నం సక్కుబాయిగా, చలపతిరావు [[కృష్ణుడు|కృష్ణు]]నిగా నటించారు.<ref>{{Cite web |url=http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_1570.html |title=శిరా కదంబం: మొదటి మహిళా చిత్ర నిర్మాత |website= |access-date=2010-06-13 |archive-url=https://web.archive.org/web/20120204183224/http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_1570.html |archive-date=2012-02-04 |url-status=dead }}</ref> [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్రాలలో మొట్టమొదటి కృష్ణుని వేసిన తొలినటుల్లో చలపతిరావు ఒకడు. నాటకాల్లో దాసరి కోటిరత్నం పురుషపాత్రలు వేస్తే ఆమెకు జంటగా తుంగల చలపతిరావు స్త్రీ పాత్రలు వేసేవారట. ఈయన రంగస్థలంపై మంచి గాయకుడుగా కూడా పేరుతెచ్చుకున్నాడు.
 
[[దివిసీమ]]లోని [[శ్రీకాకుళం (ఘంటసాల)|శ్రీకాకుళం]]లో జన్మించిన తుంగల చలపతిరావు దైతాగోపాలం దర్శకత్వంలో 'సక్కుబాయి' పాత్రలో శిక్షణ పొంది ఆ ఒక్క పాత్రలోనే అసామాన్య ఖ్యాతి గడించారు. 1935లో బి.వి.రామానందం 'సతీ సక్కుబాయి'ని సినిమాగా తీయాలని ఆ నాటక సమాజాన్నంతా కలకత్తా తీసికొని వెళ్ళారు. ఆ చలన చిత్రంలో తుంగల చలపతిరావు కృష్ణుడుగాను, నాటకాల్లో కృష్ణుడు వేషం వేసే డి. కోటిరత్నం సక్కుబాయిగాను నటించారు. 1938లో సి. పుల్లయ్య తీసిన 'మోహినీ భస్మాసుర' చలన చిత్రంలో నారదుడుగా నటించారు. అలా చలనచిత్రాలలో నటిస్తూ మరోప్రక్క సక్కుబాయి నాటకాన్ని [[ఏ.వి.సుబ్బారావు]], [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]], కె. శివరావు, దాసరి కోటిరత్నం ప్రభృతులతో కలిసి ప్రదర్శించేవారు. వరవిక్రయం, [[పాండురంగ విఠల్‌]] చిత్రాలలో పనిచేశారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/తుంగల_చలపతిరావు" నుండి వెలికితీశారు