ఉమా రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: కూచిపూడికూచిపూడి (2)
పంక్తి 39:
శ్రీమతి డాక్టర్ '''ఉమా రామారావు''' కూచిపూడి [[నర్తకి]], నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, [[రచయిత్రి]]. 1985 లో [[హైదరాబాదు]]లో తాను స్థాపించిన లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీకి నిర్దేశకులు కూడా. భారతదేశానికి చెందిన సంగీత, నృత్య, రూపక అకాడమీ 2003 లో ఉమా రామారావుని సంగీత్-నాటక్ అకాడమీ అవార్డుతో సత్కరించింది.
==పుట్టు పూర్వోత్తరాలు==
4-జూలై-1938 న "ఉమా మహేశ్వరి" డా. శ్రీ వి.వి. కృష్ణారావు, [[వడ్డాది సౌభాగ్య గౌరి|శ్రీమతి సౌభాగ్యం]] లకు [[విశాఖపట్టణం]]లో జన్మించింది. సాహిత్యం, సంగీతం, నృత్యాల యెడల అమితాసక్తిగల వేదపండితుల ఇంట జన్మించటం, వారందించిన స్ఫూర్తి, ప్రేరణలతో 5వ ఏటి నుండే ఆచార్య [[పి.వి.నరసింహా రావు]], పద్మశ్రీ డా. [[నటరాజ రామకృష్ణ]], బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి, గురు పక్కీరిస్వామి పిళ్ళై, గురు సి.ఆర్. ఆచార్యల వద్ద [[కూచిపూడి నృత్యం|కూచిపూడి]], [[భరతనాట్యం]], ఇతర సాంప్రదాయిక నృత్యరీతులని అభ్యసించటం ప్రారంభించింది. ఈ నృత్యరీతుల సైద్ధాంతిక, ఆచరణీయ కారకాలని అవపోసన పట్టినది.
 
తొలినాళ్ళలో సోదరి [[సుమతీ కౌశల్‌]]తో బాటు పలు సందర్భాలలో పలు ప్రదేశాల్లో గురువుల వ్యక్తిగత పర్యవేక్షణలో ప్రదర్శనలు చేసింది. 1953-55 లలో అప్పటి [[మద్రాసు]] ప్రభుత్వం నిర్వహించిన శాస్త్రీయ సంగీత, నృత్య పరీక్షలలో ఉత్తీర్ణురాలైనది. అటు పిమ్మట డా. నటరాజ రామకృష్ణ గారి ఆశీస్సులతో భావి తరాలకు ఈ సంప్రదాయాన్ని అందించేందుకు ఆచార్యుల వృత్తిని చేపట్టారు.
పంక్తి 53:
నృత్యకళలో విద్యార్థుల పరిశోధన, ఇతర కార్యకలాపాలలో పర్యవేక్షణకై 'షాహజీ రాజు యక్షగాన ప్రబంధాలు' (షాహజీ 1684 నుండి 1712 వరకూ [[తంజావూరు]]ని పరిపాలించిన ఒక మరాఠీ రాజు. ఈయన తెలుగు భాషలో ఇరవై యక్షగానాలని కూర్చారు.) అనే థీసిస్ ని తెలుగు విశ్వవిద్యాలయానికి సమర్పించి 1994 లో పీహెచ్ డీ పట్టాతో బాటు బంగారు పతకాన్ని కూడా అందుకొన్నారు.
 
తెలుగు విశ్వవిద్యాలయానికి నృత్య విభాగానికి అధిపతి అయిన డా. [[అలేఖ్య పుంజాల]], <ref name="అప్పుడు విద్యార్థిని.. ఇప్పుడు రిజిస్ట్రార్‌ని..">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=నవ్య - ఓపెన్ పేజి |title=అప్పుడు విద్యార్థిని.. ఇప్పుడు రిజిస్ట్రార్‌ని.. |url=https://www.andhrajyothy.com/artical?SID=514891 |accessdate=14 May 2019 |publisher=వెంకటేశ్‌ |date=1 January 2018 |archiveurl=https://web.archive.org/web/20190514101905/https://www.andhrajyothy.com/artical?SID=514891 |archivedate=14 May 2019}}</ref> జ్యోతి లక్కరాజు, మాధురి కిషోర్, పద్మ చేబ్రోలు, పల్లవి కుమార్ లు వీరి ప్రియ శిష్యురాళ్ళే.
 
===లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీ===
1985 లో లాస్యప్రియా డ్యాన్స్ అకాడమీని [[హైదరాబాదు]]లో స్థాపించారు. ఈ కళాశాల [[కూచిపూడి నృత్యం|కూచిపూడి]], [[భరతనాట్యం]] లలోని నృత్య సాంప్రదాయలని సైద్ధాంతిక, ఆచరణీయ అంశాలపై శిక్షణనిస్తూ విద్యార్థులని రాష్ట్ర ప్రభుత్వ, విశ్వవిద్యాలయ స్థాయిలో పరీక్షలకి సిద్ధం చేస్తుంది. లాస్యప్రియ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి అనుబంధ సంస్థ.
 
==అవార్డులు , సత్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ఉమా_రామారావు" నుండి వెలికితీశారు