చింతా కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''చింతా కృష్ణమూర్తి''' [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు.
==జీవిత విశేషాలు==
ఆయన 1912లో [[కృష్ణా జిల్లా|కృష్ణాజిల్లా]]కు చెందిన [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]] గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి [[చింతా వెంకట్రామయ్య]] కూడా ప్రముఖ కూచిపూడి [[నాట్యాచార్యుడు]]. ఆయన తండ్రిగారు వెంకటరామ నాట్య మండలి ట్రూపును ప్రారంభించి అనేక ప్రదర్శనలిచ్చాడు. బాల్యంలో కృష్ణమూర్తి వివిధ ప్రదర్శనలలో ప్రహ్లాదుడు, లవుడు, కుశుడు వంటి వేషాలు వేసేవాడు. తరువాత ఆయన ప్రముఖ పాత్రలైన హరిశ్చంద్ర, [[రాముడు]], [[కృష్ణుడు]], [[అర్జునుడు]], వివిధ పురాణ పాత్రలను పోషించాడు.
 
ఆయన కూచిపూడి పరంపరకు చెందిన కుటుంబానికి చెందినవాడు. ఆయన [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నృత్యాన్ని తన కుటుంబంతో పాటు ప్రముఖ నాట్యాచార్యుడు [[వేదాంతం సత్యనారాయణ శర్మ|వేదాంతం సత్యం]] వద్ద కూడా నేర్చుకున్నాడు. ఆయన వెంకటరామ నాట్య మండలి ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రదర్శనలనిచ్చేవాడు. ఆయన [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] తో పాటు [[భారతదేశం]]లోని అనేక ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చాడు. ఆయన బండ కనకలింగేశ్వరరావుతో కలసి శ్రీ సిద్దేంద్ర కళాక్షేత్రాన్ని కూచిపూడిలో నెలకొల్పడానికి కీలక పాత్ర వహించాడు. ఆయన 1969లో మరణించాడు.<ref>[http://www.indianetzone.com/30/chinta_krishnamurthy_indian_dancer.htm Chinta Krishnamurthy, Indian Dancer]</ref>
"https://te.wikipedia.org/wiki/చింతా_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు