శోధన యంత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
ఉదాహరణకి మనకి “బేటరీ” ల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం పుట్టిందనుకుందాం. కంప్యూటర్లో వీక్షణి (browser) తెరచి అందులో నిర్దేశించిన ప్రదేశంలో “బేటరీలు” అని రాసేమనుకుందాం. అప్పుడు మన కంప్యూటరు లక్షలు, కోట్లకొద్దీ జాలస్థలి (website)ల దగ్గరకి వెళ్ళి అక్కడ “బేటరీ” అనే మాట ఉందేమో వెతకాలి. ఈ వెతుకులాట జరగడానికి కేవలం లిప్త మాత్రపు కాలం పడుతుందని మనకి అనుభవం మీద తెలుసు. ఎందుకంటే మనం ప్రశ్న అడిగిన ఉత్తర క్షణంలో మనకి తెర మీద నాలుగో, అయిదో లంకెలు చూపించి ఆ లంకెల దగ్గర మనకి కావలసిన సమాచారం ఉందని శోధన యంత్రం చెబుతుంది. కోట్ల జాలస్థలులు వెతికినప్పుడు ఏయే లంకెలలో మనకి బాగా ఉపయోగపడే సమాచారం ఉందో శోధన యంత్రానికి ఎలా తెలుస్తుంది? ఈ శోధన అంతా లిప్త మాత్రపు కాలంలో ఎలా జరుగుతుంది? ఈ కిటుకు అర్థం అవాలంటే పరిశ్రమ అవసరం. వాలు కుర్చీలో వెనక్కి జేరబడి చుట్ట కాలుస్తూ “నాకు బోధ పడేలా చెప్పండి!” అంటే సాధ్యం కాదు. కాని ఒక నఖచిత్రంలా టూకీగా ఈ ప్రక్రియని పరిశీలిద్దాం.
 
ఒక ఆసామీ కంప్యూటరు దగ్గర కూర్చుని ప్రశ్న వెయ్యడానికి ముందే కంప్యూటరు తన ప్రయత్నం మొదలు పెడుతుంది. శోధనకి ఒక శోధన సూచి (Search index) అవసరం. ఇది గ్రంథాలయంలో “కేటలాగు” లాంటిది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని జాలస్థలా (websites)లలో ఉన్న సమాచారం అంతటిని సేకరించి, ఏయే జాలస్థలాలలో ఏ సమాచారం ఉందో తెలుసుకోడానికి వీలుగా శోధన యంత్రం ఒక పేద్ద శోధన సూచి ని తయారు చేస్తుంది. ఇది తయారయిన తరువాత దానిని నిరంతరం తాజీకరిస్తూ (update చేస్తూ) ఉంటుంది. ఈ తాజీకరణ ప్రక్రియ నిరంతరం, 24 గంటలూ, ఏడు రోజులూ, అలా నేపథ్యంలో జరుగుతూనే ఉంటుంది. ఈ పని చెయ్యడానికి - అనగా ప్రపంచంలో నలుమూలలా ఉన్న అన్ని జాలస్థలులని పరీక్షించి, సమీక్షించడానికి - కోటాను కోట్ల “పాకాడులు” (crawlers) ని శోధన యంత్రం పంపుతుంది. ఇవి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, ఒక వరుసక్రమంలో అమర్చి, ఏ క్షణానికి ఆక్షణం ఆ శోధన సూచికని “తాజీకరిస్తూ” ఉంటారు. (ఈ ప్రక్రియ ఎలా సాధిస్తారో తెలుసుకోవాలంటే బాగా లోతుగా శాస్త్రం అధ్యయనం చెయ్యాలి.) <ref> https://te.quora.com/%E0%B0%B6%E0%B1%8B%E0%B0%A7%E0%B0%A8-%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%95%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-crawlers/answers/262877541?__filter__=all&__nsrc__=1&__sncid__=11809252567&__snid3__=16929236849 </ref>
 
మన ఆసామీ “బేటరీ” గురించి ప్రశ్న అడగగానే శోధన యంత్రం ముందుగా కోటానుకోట్ల అంశాలు ఉన్న ఈ సూచికలో వెతుకుతుంది. ఇది లిప్త కాలప్రమాణంలో జరిగిపోతుంది. (ఇది ఎలా సాధ్యం అన్న అనుమానం వస్తే మళ్ళా ఇందాకటి సమాధానమే! బాగా లోతుగా శాస్త్రం అధ్యయనం చెయ్యాలి!)
"https://te.wikipedia.org/wiki/శోధన_యంత్రాలు" నుండి వెలికితీశారు