పాపట్ల కాంతయ్య: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
'''పాపట్ల కాంతయ్య''' నాటక కవి, హిందుస్తానీ సంగీత వాద్వాంసుడు, వాగ్గేయకారుడు. స్వరసింహ బిరుదాంకితుడైన కాంతయ్య జగ్గయ్యపేటలో 1880లో జన్మించారు. 20వ శతాబ్దపు తొలి దశకాల్లో [[చందాల కేశవదాసు]], [[బలిజేపల్లి లక్ష్మీకాంతకవి]], దైతా గోపాలం వంటి కవులతో పాటు పాపట్ల కాంతయ్య నాటక కవిగా ప్రసిద్ధిచెందాడు. ద్రౌపదీ మానసంరక్షణం (1936) వంటి కొన్ని తొలినాటి సినిమాలకు పాటల సృష్టికల్పన కూడా చేశారు. ఈ పాటలన్నీ గ్రాంధిక భాషా గుబాళింపులతో నిండి, వాటి స్వరగతులు కీర్తనా పద్ధతిలోగానీ మరాఠీ నాటక మెట్లతోగానీ వుండేవి.<ref>{{Cite web |url=http://www.eemaata.com/em/issues/199911/880.html |title=తెలుగు సినిమా పాట- ఈమాట |website= |access-date=2013-10-20 |archive-url=https://web.archive.org/web/20131230235157/http://eemaata.com/em/issues/199911/880.html |archive-date=2013-12-30 |url-status=dead }}</ref>
 
రాజమండ్రి గున్నేశ్వరరావు ఈయనను మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశానికి పరిచయం చేశారు. చింతామణి నాటక సమాజాలకు కాంతయ్య పాటలు రాశారు. అనంతరం మైలవరం కంపెనీలో వాగ్గేయకారుడిగా చేరి ప్రహ్లద, శాకుంతల, [[సావిత్రి (నాటకం)|సావిత్రి]] మొదలయిన నాటకాలకు పాటలురాసి చాలా పేరు తెచ్చుకున్నారు.
 
నేటికీ వృత్తి నాటక సమాజాల వారు పాడే ప్రార్థనా గీతం ’పరబ్రహ్మ పరమేశ్వర‘ ఈయన స్వరపరచినదే.
"https://te.wikipedia.org/wiki/పాపట్ల_కాంతయ్య" నుండి వెలికితీశారు