మొహెంజో-దారో: కూర్పుల మధ్య తేడాలు

→‎చారిత్రక నేపథ్యం: +ఆవిష్కరణ, తవ్వకం విభాగం
పంక్తి 5:
 
== చారిత్రక నేపథ్యం ==
మొహంజో-దారో క్రీసా.పూ. 26వ [[శతాబ్దము|శతాబ్దం]]లో నిర్మించబడినదినిర్మించబడింది.<ref name="Ancientindia.co.uk2">[http://www.ancientindia.co.uk/indus/explore/his03.html Ancientindia.co.uk.] Retrieved 2012-05-02.</ref> క్రీ.పూ. 3000 నుండి అభివృద్ధి చెందుతూ వచ్చిన ప్రాచీన సింధు లోయ నాగరికత (హరప్పా నాగరికత) లో నిర్మించబడిన అతిపెద్ద నగరాలలో ఇది కూడా ఒకటి.<ref>{{cite book|title=World History: Patterns of Interaction|url=https://archive.org/details/mcdougallittellw00beck|last=Beck|first=Roger B.|author2=Linda Black|author3=Larry S. Krieger|author4=Phillip C. Naylor|author5=Dahia Ibo Shabaka|publisher=McDougal Littell|year=1999|isbn=0-395-87274-X|location=Evanston, IL}}</ref> ఉచ్ఛదశలో ఉన్నపుడు ప్రస్తుత పశ్చిమాన [[పాకిస్థాన్]], [[ఉత్తర భారతదేశం|ఉత్తర భారతదేశాల]]<nowiki/>లో విస్తరించి ఉండేది. పశ్చిమాన ఇరాన్ సరిహద్దుల వరకు, ఉత్తరాన బాక్ట్రియా, దక్షిణాన గుజరాత్ వరకు విస్తరించి ఉండేది. ఈ నాగరికతకు చెందిన ప్రధానమైన నగరాలు హరప్పా, మొహంజో-దారో, [[లోథల్]], [[కాలీబంగా]], [[ధోలావీరా]], [[రాఖీగఢీ]]<nowiki/>లు. మొహంజో-దారో ఆ కాలంలో అత్యంత అభివృద్ధి చెందిన నగరం. ఇక్కడి నిర్మాణంలో శాస్త్రీయత, ఆవాస ప్రణాళికలు అత్యంత అభివృద్ధి చెందినవి. సా.పూ. 1900 ప్రాంతంలో [[సింధు లోయ నాగరికత]] అకస్మాత్తుగా అంతరించినపుడు మొహంజో-దారో నిర్మానుష్యమైపోయింది.
 
== ఆవిష్కరణ, తవ్వకం ==
ఉచ్ఛదశలో ఉన్నపుడు ప్రస్తుత పశ్చిమాన [[పాకిస్థాన్]] నుండి ఇరాన్ సరిహద్దుల వరకు, ఉత్తరాన [[అఫ్ఘానిస్థాన్]] నుండి [[ఉత్తర భారతదేశము]] నుండి దక్షిణాన గుజరాత్ వరకు విస్తరించి హరప్పా, మొహంజో-దారో, లోథాల్, [[కలిబంగాన్|కాలిబంగన్]], [[ధోలావీరా]], రాఖీఘరీలు ప్రధాన పట్టణాలుగా విలసిల్లింది. అయితే వీటన్నింటిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకొన్నది మాత్రం మొహంజో-దారోనే. ఇక్కడి నిర్మాణంలో శాస్త్రీయత, ఆవాస ప్రణాళికలు అత్యంత అభివృద్ధి చెందినవి కావటమే ఇందుకు మూలం. [[సింధు లోయ నాగరికత]] అంతరించగానే మొహంజో-దారో కళావిహీనం అయినది.
[[File:Archaeological_Ruins_at_Moenjodaro-108221.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Archaeological_Ruins_at_Moenjodaro-108221.jpg|ఎడమ|thumb]]
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి [[ఆర్.డి. బెనర్జీ]] 1919–20లో ఈ స్థలాన్ని సందర్శించే వరకు, నగర శిధిలాలు సుమారు 3,700 సంవత్సరాల పాటు ఏ గుర్తింపూ లేకుండా పడి ఉన్నాయి. అక్కడ ఉన్న గుట్టను బౌద్ధ స్తూపంగా భావించి పరిశోధించిన బెనర్జీకి అక్కడ ఒక చెకుముకి రాతిలో (ఫ్లింట్) చేసిన పార వంటి పనిముట్టు కనిపించింది.‌ దాన్ని చాలా పురాతనమైన పనిముట్టుగా తెలుసుకున్న బెనర్జీ ఈ స్థలానికి ఉన్న ప్రాముఖ్యతను పసిగట్టాడు. 1924-25లో కాశీనాథ్ నారాయణ్ దీక్షిత్ నేతృత్వం లోను, 1925-26లో జాన్ మార్షల్ నేతృత్వం లోనూ మొహెంజో-దారోలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. 1930 వ దశకంలో మార్షల్, డి. కె. దీక్షితార్, ఎర్నెస్ట్ మాకే నాయకత్వంలో ఈ ప్రదేశంలో తవ్వకాలు జరిగాయి. 1945 లో [[మోర్టిమెర్ వీలర్]], అతని శిష్యుడు అహ్మద్ హసన్ డాని మరిన్ని తవ్వకాలు జరిపారు. జార్జ్ ఎఫ్. డేల్స్ 1964 - 1965 లో చేసిన తవ్వకాలు ఇక్కడ జరిగిన చివరి తవ్వకాలు. ప్రకృతి శక్తుల వలన నష్టం జరుగుతున్న కారణంగా 1965 తరువాత అక్కద తవ్వకాలను నిషేధించారు. అప్పటి నుండి ఈ ప్రదేశంలో అనుమతించబడిన ప్రాజెక్టులు నివృత్తి తవ్వకాలు, ఉపరితల సర్వేలు, పరిరక్షణ ప్రాజెక్టులు మాత్రమే. 1980 లలో, మైఖేల్ జాన్సన్, మౌరిజియో తోసి నేతృత్వంలోని జర్మన్, ఇటాలియన్ సర్వే బృందాలు మోహెంజో-దారో గురించి మరింత సమాచారం సేకరించడానికి గాను ఆర్కిటెక్చరల్ డాక్యుమెంటేషన్, ఉపరితల సర్వేలు, స్థానికీకరించిన ప్రోబింగ్ వంటి పెద్ద చొరబాటు కలిగించని పురావస్తు పద్ధతులను ఉపయోగించాయి. 2015 లో పాకిస్తాన్ ప్రభుత్వపు మొహెంజో దారో పరిరక్షణ ఏజన్సీ చేసిన డ్రై కోర్ పరిశీలనలో, మొహెంజో దారో లో తవ్వకాలు జరిపి వెలికితిసిన దానికంటే తవ్వకాలు జరపని విస్తీర్ణమే ఎక్కువని తేలింది.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మొహెంజో-దారో" నుండి వెలికితీశారు