కె. ఎస్. చిత్ర: కూర్పుల మధ్య తేడాలు

changed from honours to awards
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
'''చిత్ర''' గా సుపరిచితురాలైన '''కె. ఎస్. చిత్ర''', భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదునందుకున్న ఈమె [[మలయాళం]], [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడ]], [[ఒరియా]], [[హిందీ]], [[అస్సామీ]], [[బెంగాలీ]] మొదలైన భాషల సినిమాల్లో సుమారు 25 వేలకు పైగా పాటలు పాడింది. చిత్ర 2005 లో భారత ప్రభుత్వం [[పద్మశ్రీ పురస్కారం]], 2021 లో [[పద్మభూషణ్ పురస్కారం]] అందుకున్నది.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
==వృత్తి జీవితం==
చిత్ర అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి శాంతకుమారి ఇద్దరి పేర్లు పూర్తి పేరులో ఉన్నాయి.<ref name="eenadu">{{Cite web|url=https://www.eenadu.net/sundaymagazine/article/321000133|title=పిల్లల కోసమే అక్కడికి వెళ్తా..! - Sunday Magazine|website=www.eenadu.net|language=te|access-date=2021-02-07}}</ref> ఈమె [[1963]], [[జూలై 27]]న [[కేరళ]]లోని [[తిరువనంతపురము]]లో, సంగీతకారుల కుటుంబంలో జన్మించింది. బాల్యంలో తండ్రి దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. చిత్ర అక్క బీనా, తమ్ముడు మహేష్. వీరి తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒకరిని సంగీతంలోకి పంపాలనే కోరికగా ఉండేది. అందుకుగాను బీనాకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అక్క సాధన చేసేటపుడూ చిత్ర కూడా ఆమెతో పాటు స్వరాలు పాడేది. చిన్నతనంలో ఉండగానే [[ఆకాశవాణి|ఆలిండియా రేడియో]]లో రెండేళ్ళ కృష్ణుడికి ఈమె చేత పాట పాడించారు. ఆమె తొలి రికార్డింగ్ అదే.<ref name="eenadu"/>
 
చిత్ర పూర్తి స్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కోరికమేరకు కేంద్రప్రభుత్వం అందించే ''నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్ షిప్'' కి దరఖాస్తు చేసుకుంది. కానీ అందుకోసం అప్పటి వరకే రెండేళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. కానీ ఆమెకు అప్పటిదాకా ఉన్న సంగీత పరిజ్ఞానంతో అందుకు దరఖాస్తు చేసింది. ఎంపికలో భాగంగా ఆమె న్యాయనిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాజ కృతిని పాడింది. అందులో ఆమెకు తెలియకుండానే అసావేరి రాగంలో ఒక ప్రయోగం చేసింది. ఆమె ప్రతిభను గమనించిన న్యాయనిర్ణేతలు ఉపకారవేతనానికి ఎంపిక చేశారు. అలా ఆమె 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంతో డా. కె. ఓమనకుట్టి వద్ద [[కర్ణాటక సంగీతము]]లో విస్తృతమైన శిక్షణ పొందింది. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ ఈమె [[మలయాళ భాష|మలయాళ]] సినీ నేపథ్యగానానికి చిత్రను పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] నేతృత్వములో ఈమె [[చెన్నై]]లోని [[తమిళ భాష|తమిళ]] సినిమారంగములో అడుగుపెట్టింది. దక్షిణాది భాషలు, [[హిందీ భాష|హిందీ]]లలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు. <!-- Her knowledge of South Indian languages and Hindi enables her to render songs with originality and perfection. Her voice is versatile and she sings with a great feel. -->
 
== సినిమా కెరీర్ ==
ఈమె గురువు ఓమనకుట్టి అన్నయ్య అయిన ఎం. జి. రాధాకృష్ణన్ 1979లో ఓ మలయాళ సినిమాలో మొట్టమొదటిసారిగా పాడించాడు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. 1982లో మళ్ళీ ఒక యుగళగీతం పాడే అవకాశం వచ్చింది. మొదట్లో ట్రాక్ కోసమని ఓమనకుట్టి తమ్ముడు శ్రీకుమరన్, చిత్ర కలిసి పాడారు. తర్వాత అసలైన పాట కోసం కె. జె. ఏసుదాసు తో పాటు పాడే అరుదైన అవకాశం దక్కింది. మొదటిసారి తప్పులు పాడినా జేసుదాసు సహకారంతో విజయవంతంగా పాడగలిగింది. దాంతో ఆమెకు మిగతా సంగీత దర్శకులు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఆమె గొంతు చిన్నపిల్లలా ఉందని ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒక మలయాళ సినిమాను దర్శకుడు ఫాజిల్ తమిళంలో కూడా తీద్దామనుకున్నాడు. నటి నదియా కోసం మలయాళంలో చిత్ర పాటలు పాడింది. సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] ఈమె గొంతు కొత్తగా ఉందని తమిళంలో కూడా ఆమెకే అవకాశం ఇచ్చాడు.
 
దీని తర్వాత సింధుభైరవి అనే చిత్రంలో తెలుగులో పి. సుశీల పాడిన ''నేనొక సింధు'' అనే పాటను తమిళంలో చిత్ర పాడింది. తర్వాత అదే సినిమాలో ''పాడలేని పల్లవైన భాషరాని దానను'' అనే పాటను తమిళ, తెలుగు భాషల్లోనూ చిత్రనే పాడింది. తెలుగు సినిమాల్లో చిత్రకు ఇదే తొలిపాట. ఈ పాటకు ఆమెకు తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కడమే కాక లెక్కలేనన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. దక్షిణాది భాషలు, [[హిందీ భాష|హిందీ]]లలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు. <!-- Her knowledge of South Indian languages and Hindi enables her to render songs with originality and perfection. Her voice is versatile and she sings with a great feel. -->
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._చిత్ర" నుండి వెలికితీశారు