శివయోగి సిద్ధరామేశ్వర: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox Hindu leader | name = సిద్ధరామేశ్వరుడు | native_name = సిద్ధేశ్వరుడు | other_name = సి...'
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
 
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 33:
మహాజ్ఞానియు, షట్స్థల చక్రవర్తియును అగు చెన్నబసవేశ్వరుండ, ప్రభువు ఆజ్ఞానుసారము సిద్ధరామయ్యకు లింగ దీక్షాసంస్కారంబు ఒనర్చి లింగాంగ సామరస్యానుచారమును బోధించినాడు.సిద్ధరామయ్య అనుభావ సంపన్నుడై, శివయోగియై అనుభవమంటపమునందు ప్రముఖస్థానమును పొందగలిగెను.తన వచనములతో ఇతరులకు జ్ఞానమును బోధించుచుండెను.కొన్నాళ్లకు కల్యాణగ్రామమునందు చెలరేగిన విప్లవమునకు, రక్తపాతమునకు తన సమ్మతి లేనందున, సిద్ధరామయ్య తన స్వస్థానమునకు తిరిగిపోయినాడు.ఒకనాడు తన దివ్యదృష్టితో తనకు అంత్యకాలము సమీపించినదని తెలుసుకొని తాను నిర్మించిన కొలనునందు సమాధిని నిర్మించుకొని అందులో ప్రవేశించి లింగ నిష్ఠయందు ఉండి నిర్భయలయ్యెనని ఆతని చరిత్ర తెలుపుచున్నది. నేడు సొన్నలి పురమునందు అతని సమాధి స్థానము సిద్ధేశ్వర దేవాల్యము అనుపేరుతో సుప్రసిద్ధ యాత్రస్థలమై ఉన్నది.
 
సిద్ధరామేశ్వరుడు వచనములనేకాక, అనేక గీతములను, బసవస్తోత్రత్రివిధి, మిశ్రస్తోత్ర త్రివిది, అష్టావర్ణ స్తోత్రత్రివిధి అను ఇతర రచనములను కూడా రచించి విపులమగు సాహిత్యమును సృష్టించియున్నాడని తెలియుచున్నది.
==మూలము==
*1980 భారతి మాస పత్రిక. వ్యాసము: శివయోగి సిద్ధరామేశ్వరుడు. వ్యాసకర్త:శ్రీ రేకళిగెమఠం వీరయ్య.