లేపాక్షి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
ఇచ్చట గుట్టవంటి రాతి నిచ్చట బసవేశ్వరుడుగా తీర్చిదిద్దినారు. ఇంత పెద్ద బసవడు మనికెన్ని చోట్లలనో దొరకడు.ఈగుడిని ఉద్ధేసించి "లేపాక్షి రామాయణము" అను హరికథ కూడాకలదు.దేవాలయాలకు కల్యాణమండపాలుండడము మన మెరుగుదుము. ఈ ఆలయములో కల్యాణమండపము ఉన్నది (అసంపూర్ణము) ఉన్నదీ,లతా మండపమున్నది.పాతికకు మించిన శిలా స్తంభాలు, నాలుగు వైపులా లతలను చెక్కిపెట్టినవి, చేరి లతా మండప మేర్పరచినవి.ఇలాంటి మండపము ఇతరచోట్ల సామాన్యముగా కానరాదు. నాలుగు కాళ్ళ మండపము విజయనగరపు ఆలయాలలో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కాని ఈ ఆలయంలో ప్రాకరములో వైపున పశ్చిమ భాగంలో ఉంది.
శిల్పాలంకారములు-ముఖ్యముగా చెట్లను పెకలించబోయే ఏనుగులను-పరిశీలిస్తే [[శ్రీశైల క్షేత్రం|శ్రీశైలం]] దేవాలయ ప్రాకరశిల్పాల పోలిక చాలా కనబడుతుంది. పంచముఖ బ్రహ్మ ఇక్కడి ప్రత్యేకత.శిల్పరూపాలు- స్తంభాలకు చేరా చెక్కినవి, ఇంచుమించు నాలుగైదు అడుగులవి ఇక్కడ కనబడుతాయి.[[రెడ్డిరాజులు]] కోరుకొండ, దక్షరామము, పలివెల దేవాలయములలోని స్తంభాలతో తమ శిల్పాకృతులను చెక్కించారు. తాడిపత్రి రామలింగేశ్వరాలయపు గోపురముమీద శిల్పి విగ్రహమూ, తిమ్మరసు విగ్రహమూఉన్నాయి.అయితే, మందవ స్తంభాలకు చేరా చెక్కించిన విగ్రహాలు ఇంత పెద్దవి ఇతరచోట్ల కానరావు.ఈ ఉదాహరణమును చూచి అహోబిల దేవాలయ మండపములో తిరుమల దేవరాయలూ, సోమపాలెము చావడిలో పెద్ది నాయకుడూ పెద్ద విగ్రహాలూ చెక్కించారు, మధుర మీనాక్షి దేవళములో తిరుమల నాయకుడు ఈ అలవాటును బ్రహ్మాండంగా పెంచాడు. లేపాక్షి ఆలయములోని నాగలింగమంతటిదీ, లేపాక్షి నంది అంతటిదీ భారతదేశములో మరిలేవు.
అజంతా తరువాత లేపాక్షి మండపాలలో కప్పులమీద చిత్రించిన రూపాలంతటి బృహద్రూపాలు మరిలేవు. లేపాక్షి అర్ధ మండపములో కప్పుమీది వీరభద్రుదంతటి పెద్ద వర్ణ చిత్రము భారతదేశములో మరిలేదు. కళాకారులు జైనులే అయినా, శిల్పమూ చిత్రకళా బృహద్రూపాలలో కోడము విజయనగర కళా ప్రభావమే.కళాకారులు జైనులనుటకు పలు నిదరసనములు కనబడుతున్నవి. లేపాక్షి వర్ణ చిత్రకారులు వర్ణలేపనములో, విన్యాసాలలో, దీర్ఘచిత్రాలలో, వస్త్రాలంకార సామాగ్రులలో జైన చిత్ర కళాసంప్రదాయాల్నే పాటించారు.శిల్పులు దేవతల వాహనాల్ని జైన తీర్ధంకురుల చిహ్నాల సైజులో చెక్కారు. స్త్రీల నగ్నత్వము చాలా అరుదు లేపాక్షిలో. పెనుకొండ పెద్ద జైన విద్యాస్థానము.ఈనాటికీ రెండు జైన ఆలయములు పూజలందుకుంటున్నవి.విరుపణ్ణ పెనుగొండ నాయంకరము పొందినవాడు.కళాకారులు అక్కడివారే కావడము వింతకాదు.లేపాక్షిలో శిల్పమూ చిత్రకళా సమ సంప్రదాయాలతోనే నడచినవి.మూడుకాళ్ళ భృంగీ, ఆరుచేతుల స్నానశివుడూ అవుననే తార్కాణ.
 
"https://te.wikipedia.org/wiki/లేపాక్షి" నుండి వెలికితీశారు