టైటానిక్ నౌక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎ఘోర ప్రమాదం: 2012 ni 1912 gaa marchinamu
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
 
== ఘోర ప్రమాదం ==
2012 1912[[ఏప్రిల్ 14]] [[ఆదివారం]] రాత్రి చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. [[సముద్రం]] నిశ్చలంగా ఉంది. [[చంద్రుడు]] కనపడడం లేదు. [[ఆకాశం]] నిర్మలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్ లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగా [[దక్షిణం]] వైపుకు మళ్ళించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి ''అమెరికా'' అనే స్టీమరు టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం ''మెసాబా'' అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు.
 
రాత్రి 11:40 సమయంలో టైటానిక్ ''న్యూఫౌండ్ లాండ్స్'' (ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం) వద్దగల గ్రాండ్ బ్యాంక్స్ (సముద్రం లోపల ఉండే పీఠభూముల్లాంటి ప్రదేశాలు) లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్ళే ''ఫ్రెడెరిక్ ఫ్లీట్'', ''రెజినాల్డ్ లీ'' టైటానిక్ కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్ళే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్ళించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగి పోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైంది. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడేసింది.
"https://te.wikipedia.org/wiki/టైటానిక్_నౌక" నుండి వెలికితీశారు