"తిరుపతి వేంకట కవులు" కూర్పుల మధ్య తేడాలు

 
==అవధానాలు==
వీరు తమ గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి ప్రోత్సాహంతో కాకినాడలో మొట్టమొదటిసారి జంటగా అష్టావధానాన్ని, ఆ తర్వాత 1890 అక్టోబరులో ఒక శతావధానాన్ని చేశారు. అయితే చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అంతకు ముందే కాశీయాత్ర కోసం అవసరమైన డబ్బు కొరకు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[నిడమర్రు]], [[గుండుగొలను]] గ్రామాలలోను, కాశీనుండి తిరిగి వచ్చిన తర్వాత గంగా సంతర్పణ కోసం [[ముమ్మిడివరం]], [[అయినవిల్లి]] గ్రామాలలో [[అష్టావధానాలు]] చేశాడు. కాకినాడ అవధానాల తర్వాత వీరిరువురూ చెలరేగి పల్లెల్లో, పట్టణాలలో, రాజాస్థానాలలో వందలకొద్దీ అవధానాలు చేశారు. [[కాకినాడ]], [[అమలాపురం]], [[ఏలూరు]], [[మచిలీపట్నం|బందరు]], [[నెల్లూరు]], [[విశాఖపట్నం]], [[బెజవాడ]], [[చెన్నై|మద్రాసు]], [[గుంటూరు]], [[రాజమండ్రి]] మొదలైన పట్టణాలలోను, [[గద్వాల]], [[వనపర్తి]], [[ఆత్మకూరు (నెల్లూరు)|ఆత్మకూరు]], [[వెంకటగిరి]], [[విజయనగరం]], [[నూజివీడు]], [[కిర్లంపూడి]] మొదలైన సంస్థానాలలోను శతావధానాలు, అష్టావధానాలు, ఆశుకవితా ప్రదర్శనలు చేశారు. ఈ అవధానాలన్నింటిలోను తిరుపతిశాస్త్రి ఒక పాదం చెబితే వేంకటశాస్త్రి మరొక పాదం చెప్పేవాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=119-128|edition=ప్రథమ|accessdate=18 July 2016|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
 
వీరి అవధానాలలో వెలువడిన కొన్ని పద్యాలు:
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3137500" నుండి వెలికితీశారు