"ప్రాణ్" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
'''ప్రాణ్ ''' ఒక ప్రముఖ భారతీయ నటుడు. తనదైన విలక్షణ శైలితో దాదాపు 400 చిత్రాలలో నటించాడు. దాదాపు ఆరు శతాబ్దాలపాటు ఇతని నట జీవితం సాగింది. కొన్ని తెలుగు చిత్రాలలో కూడా ప్రతినాయక పాత్రలను పోషించాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
ప్రాణ్ [[ఫిబ్రవరి]] 12, 1920న పాతఢిల్లీలోని బల్లిమరన్ అనే ప్రాంతంలో ఒక సంపన్న [[పంజాబీ భాష|పంజాబీ]] కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి కేవల్ క్రిషన్ సికంద్ సివిల్ ఇంజనీరుగా ప్రభుత్వ కాంట్రాక్టరుగా పని చేసేవాడు. ఆయన తల్లి రామేశ్వరి. వారికి నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు.
 
ప్రాణ్ చిన్నతనంలో చదువులో ముఖ్యంగా [[గణితం]]లో మంచి ప్రతిభ కనబరిచాడు. తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో నివసించాల్సి రావడంతో ఆయన [[డెహ్రాడూన్]], కపుర్తలా, [[మీరట్]] లాంటి అనేక ప్రదేశాల్లో చదివాడు. చివరగా మెట్రిక్యులేషన్ [[ఉత్తర ప్రదేశ్]] లోని రాంపూర్ లో పూర్తిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3139158" నుండి వెలికితీశారు