మదురై ఎన్.కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 18:
'''మదురై నారాయణన్ కృష్ణన్''' (1928–2005) భారతీయ కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్ర విద్వాంసుడు. ఇతడు గాయకుడిగా, గీతరచయితగా, సంగీతస్వరకర్తగా రాణించాడు. ఇతడిని "వాగ్గేయకారుడి"గా పలువురు వర్ణిస్తున్నారు. ఇతనికి భారత ప్రభుత్వం 1992లో [[పద్మశ్రీ పురస్కారం]], 2003లో [[పద్మభూషణ్ పురస్కారం]] ఇచ్చి గౌరవించింది.<ref name="Padma Awards">{{Cite web |url=http://www.dashboard-padmaawards.gov.in/ |title=Padma Awards |date=17 May 2018 |website=Padma Awards |publisher=Government of India |access-date=17 May 2018}}</ref> ఇతనికి [[సంగీత నాటక అకాడమీ అవార్డు]], [[కళైమామణి]] పురస్కారం, [[యునెస్కో]] అవార్డులు కూడా లభించాయి.
==జీవిత విశేషాలు==
మదురై ఎన్.కృష్ణన్ [[1928]], [[అక్టోబరు 31]]వ తేదీన [[తమిళనాడు]]లోని [[మదురై]] పట్టణంలో సంగీత కళాకారుల కుటుంబంలో<ref name="A tribute to Vidwan Madurai N. Krishnan">{{Cite web |url=http://www.kutcheribuzz.com/news/music/1306-tribute-madurai-n-krishnan |title=A tribute to Vidwan Madurai N. Krishnan |last=User |first=Super |date=25 November 2018 |website=www.kutcheribuzz.com |access-date=25 November 2018}}</ref> జన్మించాడు.<ref name="A conversation with Madurai N.Krishnan">{{Cite web |url=http://www.carnatica.net/special/maduraikrishnan.htm |title=A conversation with Madurai N.Krishnan |date=25 November 2018 |website=Carnatica.net |access-date=25 November 2018}}</ref> ఇతని తండ్రి మదురై నారాయణ అయ్యంగార్ ఒక హరికథావిద్వాంసుడు. ఇతని అన్న మదురై ఎన్.శ్రీనివాస అయ్యంగార్ వయోలిన్ విద్వాంసుడు. [[అరియకుడి రామానుజ అయ్యంగార్]], రామనాథపురం పూచి శ్రీనివాస అయ్యంగార్‌లు ఇతని సమీప బంధువులు. ఇతడు తన తండ్రి వద్ద, అన్న వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాడు. తరువాత కారైకుడిలోని తమిళ్ సంగీత పాఠశాలలో చేరాడు.<ref name="Vidwan Madurai N. Krishnan passes away">{{Cite web |url=http://www.kutcheribuzz.com/news/music/1314-madurai-n-krishnan |title=Vidwan Madurai N. Krishnan passes away |last=User |first=Super |date=25 November 2018 |website=www.kutcheribuzz.com |access-date=25 November 2018}}</ref> తరువాత ఇతడు [[అరియకుడి రామానుజ అయ్యంగార్]] వద్ద 18 సంవత్సరాలు గురుకుల పద్ధతిలో సంగీతాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఇతని మొట్టమొదటి కచేరీ [[తిరుపతి]]లో [[పాల్గాట్ మణి అయ్యర్]], వెల్లూర్ జి.రామభద్రన్‌ల వాద్యసహకారంతో జరిగింది.<ref name="Madurai N.Krishnan, a multi-faceted artiste">{{Cite web |url=http://www.sify.com/entertainment/movies/kannada/fullstory.php?id=13971815 |title=Madurai N.Krishnan, a multi-faceted artiste |date=25 November 2018 |website=www.sify.com |language=en |access-date=25 November 2018 |archive-date=25 నవంబర్ 2018 |archive-url=https://web.archive.org/web/20181125205632/http://www.sify.com/entertainment/movies/kannada/fullstory.php?id=13971815 |url-status=dead }}</ref>
 
ఇతనికి గాత్రంతో పాటు మృదంగంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఇతడు అనేక జతిస్వరాలు, వర్ణాలు, తిల్లానాలు, పదములు, జావళీలు రచించాడు<ref name="నాదరేఖలు">{{cite book |last1=శంకర నారాయణ, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం |title=నాదరేఖలు |date=1 May 2015 |publisher=శాంతా - వసంతా ట్రస్ట్ |location=హైదరాబాదు |page=147 |edition=1 |url=http://vyzarsu.com/Naada%20Rekhalu-Ebook.pdf |accessdate=18 February 2021}}</ref>. అంతే కాకుండా [[తిరుప్పావై]], [[నాలాయిర దివ్య ప్రబంధము]], తిరువాసగం వంటి తమిళ సాహిత్యాన్ని సంగీత నృత్య రూపకాలుగా మలిచి వాటికి సంగీతం సమకూర్చాడు.<ref name="Vidwan Madurai N. Krishnan passes away" /> ఇతడు సంగీతానికి చెందిన గాత్రం, సాహిత్యం, స్వరకల్పన అనే మూడు పార్శ్వాలలో నైపుణ్యం సంపాదించి ''వాగ్గేయకారుడు''గా పిలువబడ్డాడు.<ref name="Madurai N Krishnan is no more">{{Cite web |url=https://www.dnaindia.com/india/report-madurai-n-krishnan-is-no-more-5094 |title=Madurai N Krishnan is no more |date=10 October 2005 |website=dna |language=en-US |access-date=25 November 2018}}</ref> ఇతడు సంగీతం సమకూర్చిన నృత్యరూపకాలను సుధారాణి రఘుపతి, [[చిత్రా విశ్వేశ్వరన్]] వంటి అనేక మంది నాట్యకళాకారిణులు ప్రదర్శించారు. 1965లో ఇతడు చిత్రా విశ్వేశ్వరన్‌తో కలిసి శ్రీ భరతాలయ అనే సంగీత నృత్య అకాడమీని స్థాపించి దానికి డైరెక్టర్‌గా వ్యవహరించాడు.<ref name="A tribute to Vidwan Madurai N. Krishnan" />
"https://te.wikipedia.org/wiki/మదురై_ఎన్.కృష్ణన్" నుండి వెలికితీశారు