"కుమారజీవుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: చక్రవర్తి → చక్రవర్తి (2)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
చి (clean up, replaced: చక్రవర్తి → చక్రవర్తి (2))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
|}}
 
క్రీ.శ 5 వ శతాబ్దికి చెందిన '''[[కుమారజీవుడు]]''' [[మధ్య ఆసియా]] నగర రాజ్యమైన కూచా (Kucha) లో జన్మించిన సుప్రసిద్ధ బౌద్ధ సన్యాసి. మహాయాన బౌద్ద పండితుడు. [[ప్రపంచము|ప్రపంచ]] అత్యుత్తమ అనువాదకులలో ఒకడు.
 
ఇతని తల్లి జీవిక కూచా రాకుమార్తె. తండ్రి కుమారయాన భారతీయ బ్రాహ్మణుడు. జన్మతా [[భారతీయుడు]] కానప్పటికి భారతీయ మూలాలను కలిగివున్న కుమారజీవుడు [[బాల్యం]] నుండే అత్యంత ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకొన్నాడు. తన తొమ్మిదవ సంవత్సరం నుండే తల్లితో కలసి దేశాలు పర్యటిస్తూ, [[కాశ్మీర్]], కాష్గర్, కూచా లలో బౌద్ధ సిద్ధాంతాలు అభ్యసించాడు. తొలుత సర్వాస్థివాద (హీనయానం) శాఖను అనుసరించినప్పటికి తరువాత మహాయాన బౌద్ధం లోకి మారాడు. ఇరవై సంవత్సరాల వయసు వచ్చేనాటికి [[మధ్య ఆసియా]]లో అత్యంత ప్రముఖ బౌద్ధ సన్యాసిగా, అఖండ మేధో సంపన్నుడుగా పేరుగాంచాడు. [[మధ్య ఆసియా]] నుండే కాక, తూర్పు ఆసియా, [[చైనా]] దేశాలనుండి బొద్ద బిక్షువులు బోధనల కోసం, జ్ఞాన సముపార్జనకోసం ఇతని వద్దకు వచ్చేవారు. అయితే దురదృష్టవశాత్తూ చైనా దేశపు అంతర్గత రాజకీయ పోరులో నలిగిపోయి 17 సంవత్సరాలు పాటు యుద్ద ఖైదీగా బందీలో ఉన్నాడు. చివరకు విడుదలై క్రీ.శ 401 లో ఉత్తర చైనా రాజధాని ‘చాంగన్’ (changan) లో స్థిరపడ్డాడు.
 
==చైనాలో నిర్భందం – విడుదల==
కుమారజీవుని రాకకై వేగిరపడిన చైనా చక్రవర్తి యొక్క ఆజ్ఞ మేరకు అతని సేనాధిపతి జనరల్ ‘లుగుయాంగ్’ (Gen. Lu Guang) క్రీ.శ. 383 లో కూచా రాజ్యంపై దాడిచేసి రాజుని చంపి కుమారజీవుని బంధించాడు. బంధించబడే నాటికి కుమారజీవుని వయస్సు 40 సంవత్సరాలు. ఇదే సమయంలో ఉత్తర చైనా రాజ్యంలో అంతర్గత రాజకీయ పోరు సంభవించింది. కిన్ వంశానికి చెందిన పాత [[చక్రవర్తి]] చంపబడటం, యావో వంశానికి చెందిన కొత్త చక్రవర్తి అధికారంలోకి రావడం జరగడంతో సేనాధిపతి జనరల్ లుగుయాంగ్ తన విధేయతను మార్చుకొని స్వతంత్రం ప్రకటించుకొన్నాడు. యుద్ద ఖైదీ అయిన కుమారజీవుని చక్రవర్తి వద్దకు పంపకుండా తన రాజధాని ‘లియాంగ్ గ్జౌ’ (Liangzhou) లో తన వద్దనే 16 సంవత్సరాలుకు పైగా బందీగా వుంచుకొన్నాడు. ఈ బందీ పరిస్థితులలోనే కుమారజీవుడు చైనా భాషను నేర్చుకొనడం జరిగింది. తదనంతరం రెండవ చక్రవర్తి అయిన యావో జింగ్ (Yao Xing) తన సేనాధిపతి జనరల్ లుగుయాంగ్ ప్రదర్శిస్తున్న ధిక్కార ధోరణికి విసిగిపోయి క్రీ.శ. 401 లో అతనిపై దాడి చేసి ఓడించి కుమారజీవుని సురక్షితంగా విముక్తి చేసి తన రాజధాని చాంగన్ కు రప్పించుకొన్నాడు. ఈవిధంగా చైనా అంతర్గత [[రాజకీయాలు|రాజకీయ]] పోరులో నలిగిపోయిన కుమారజీవుడు క్రీ.శ. 384 నుండి 401 వరకు 16 సంవత్సరాలకు పైగా అకారణంగా బందీయై మగ్గిపోవలసి వచ్చింది.
 
==చాంగన్ నగరంలో కుమారజీవుడు==
==చక్రవర్తి యావో జింగ్ తో కుమారజీవుని సత్సంబందాలు==
కుమారజీవుడు ఆనాటి ఉత్తర చైనా [[చక్రవర్తి]] యావో జింగ్ (Yao Xing) (క్రీ.శ. 366 - 416) తో చక్కని స్నేహపూరితమైన సంబంధాలు కలిగి ఉన్నాడు. కుమారజీవుని అసాధారణ ప్రజ్ఞా పాటవాలు, బౌద్ద ధర్మ వివరణలో అతనికున్న సాధికారత, చక్రవర్తిని అమితంగా ఆకర్షించాయి. బౌద్ద గ్రంథాల చైనా అనువాద ప్రక్రియలకు సమర్ధుడిగా అతనినే భావించిన చక్రవర్తి కుమారజీవుని శత్రు చెర నుంచి విడిపించి తన వద్దకు రప్పించుకొన్నాడు. జాతీయ గురువుగా గౌరవించడమే కాకుండా, రాజ గురువుగా ప్రకటించి తన ఆస్థానంలో అతని స్థాయిని అతి స్వల్ప వ్యవధిలోనే ఉన్నతీకరించాడు. అనువాద కేంద్రానికి నాయకుడిగా చేసి బృహత్తర అనువాద కార్యక్రమ బాధ్యతను కుమారజీవుని భుజ స్కంధాలపై నిలిపాడు.
 
అదేవిధంగా చక్రవర్తి చూపిన ఆదరణ, అందించిన తోడ్పాటు, అనువాదం పట్ల చక్రవర్తికి గల ప్రత్యేకాసక్తిని గమనించిన కుమారజీవుడు చక్రవర్తి అభిమతానికి అనుగుణంగా అనువాద కార్యక్రమాన్ని రాజధానికి చేరుకొన్న ఆరు రోజుల వ్యవధిలోనే ప్రారంభించాడు. తను మరణించేవరకూ 12 సంవత్సరాలపాటు నిరాఘాటంగా అసమాన కృషితో అనువాద యజ్ఞాన్ని కొనసాగించి చక్రవర్తి అభిమానానికి పాత్రుడయ్యాడు.కుమారజీవుని ప్రభావంతో చక్రవర్తి యావో జింగ్ తన రాజ్యంలో అనేక బౌద్దాలయాలు, నిర్మించాడు. కుమారజీవుని ప్రభావం వలన ఈ చక్రవర్తి కాలంలోనే బౌద్దమతానికి తొలిసారిగా రాజ మద్దతు లభించింది. ఫలితంగా కుమారజీవుని ప్రభావంతో ఇతని రాజ్యంలో 90 శాతం ప్రజలు బౌద్ధులుగా మారారని వర్ణించబడింది.
* Himalaya Calling: The Origins of China and India, World century publishing corporation, NJ 07601, USA
* Saints & Sages of Kashmire-T.N Dhar Kundan (A.P.H. Publishing Corporation, New Delh -2004)
* Some Aspects of Asian History and Culture –Upendra Thakur (Abhinav Publications –1986)
 
[[వర్గం:బౌద్ధ పండితులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3141473" నుండి వెలికితీశారు