ఉగాది: కూర్పుల మధ్య తేడాలు

Fixed the file syntax error.
చి clean up, replaced: కృష్ణుడుకృష్ణుడు
పంక్తి 27:
వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యవతారిదారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'
 
శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి.<ref name="nedunuri">{{ Cite web |url=https://archive.org/details/in.ernet.dli.2015.394427/page/n9 |title=పండుగలు పరమార్థములు (పల్లెటూరి పాటలతోబాటు) |author=నేదునూరి గంగాధరం|date=1956|page=8}}</ref> ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
 
ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది.  
పంక్తి 41:
=== యుగయుగాల ఉగాది ===
[[File:అరటి పండ్లు (2).jpg|thumb|అరటి పండ్లు|alt=|250x250px]]
[[రామాయణం]]లో చైత్రం 12 వనెల.రాముడు ఋతువులన్నీ గడిచి 12 వ నెల అయిన చైత్రమాసంలో శుద్ధ నవమినాడు జన్మించినట్లు బాల కాండలో ఉంది. ( తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిధౌ) దీనినిబట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది. మార్గశిర పుష్య మాసాలున్న హేమంతంతో సంవత్సరం ప్రారంభమని [[కౌత్యుడు]] మతం. [[అమరసింహుడు]] [[అమరకోశము]] కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాలతోనే మొదటి ఋతువని అన్నాడు.మార్గశిర మాసానికి '''ఆగ్రహాయణికః''' అనేది పర్యాయ పదం. ఆగ్రంలో హాయనం కలది- అంటే సంవత్సరమంతా ముందుండేది, లేక సంవత్సరాగ్రంలో ఉండేది. అంటే మన సంవత్సరాది మార్గశిర పుష్య, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖాల వరకు డేకుతూ వచ్చిందనడం స్పష్టం. అంటే ఆశ్వీజామావాస్య కార్తీక పూర్ణిమ, మార్గశిర పుష్యాలలో సంక్రాంతి పండుగ, మాఘ పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ, హోలీ పండుగ, వసంతపంచమి, వైశాఖ పౌర్ణమీ ఇవన్నీ సంత్సరాదులే. రామాయణంలో అన్నట్లు వైశాఖంలో సవత్సరం ప్రారంభించే ఆచారం వల్లనే కాబోలు నేడు ఉత్తరాపధంలో సూర్యమాన సంవత్సరాదికి బైసాఖి ( వైశాఖి) అనే వ్యవహారం ఉంది. [[భారతం]]లో చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువనే గణన ఉంది. భవిష్య పురాణంలో యుగాదులను గూర్చిన వర్ణన కూడా సంవత్సరాది వైవిధ్యాన్ని ధ్రువ పరుస్తాయి. కృతయుగం వైశాఖ తృతీయనాడు, త్రేతాయుగం కార్తీక నవమినాడు, ద్వాపరయుగం ఆశ్వీజ త్రయోదశినాడు, కలియుగం ఫాల్గుణ పౌర్ణమినాడు పుట్టాయని [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] [[ధర్మరాజు]]కు చెప్పినట్టు, వీటిని యుగాదులంటారని అన్నట్టు ఉంది. ( యుగాదయశ్చ కథ్యంతే తధైతా స్సర్వ సూరిభిః) మరి ఈ దినమే ఉగాది ఎలా?
 
ఋతువులు కాలధర్మంతో సంబంధించినవి కనుక సాయనాలు.ఎప్పటికప్పుడు కదిలిపోతుంటాయి విషువత్తునిబట్టి. విషువత్ మారినా మనం ఇప్పటికీ చైత్ర వైశాఖమాసాలు వసంతఋతువు అంటున్నాము. రామాయణకాలంలో వైశాఖజ్యేష్ఠాలు వసంతం.భారతకాలంలో విషువత్ చలించడంవల్ల చైత్ర వైశాఖమాసాల్లో పడ్డది.అంటే భారతకాలంలో విషువత్ మృగశిరంలో వచ్చి, వరాహమిహిరుని కాలానికి అశ్విన్యాదికి చలించింది.కనుకనే [[విష్ణుపురాణం]] '''మేషాదౌచ మృగాదౌచ మైత్రేయ '''విషవః స్థితాః''' అని చెప్పింది.''' తర్వాత మారుతూ వచ్చిందనే కదా!! నేడు మాఘమాసంతోనే వసంతఋతువు ప్రారంభమవుతుంది.చైత్ర వైశాఖ మాసాలలో ఎండలు.నేడు ధర్మసింధువుకారుడు ఉగాది కాలానికి వేపకొళ్ళు తినడం చేయమన్నాడు. కాని మన ఉగాది కాలానికి వేపచిగుళ్ళు ముదిరి పూతకూడ రాలిపోయి, పిందెలు పుడుతున్నాయి. [[వరాహమిహిరుడు]] క్రీస్తుశకం 5వ శతాబ్దివాడు.తనకు కొన్ని శతాబ్దాలముందే విషువత్ మృగశిరనుండి అశ్వినీనక్షత్రం ప్రథమపాదానికి రావడం గుర్తించాడు. వేదాంగ జ్యోతిష్య కాలంకంటే ప్రాచీనమైన ప్రాహ్మణాలకాలంలో వసంత విషుత్కాలం కృత్తికానక్షత్రంలో సంభవించిందని పరిశీలించాడు. తనకాలంలో వసంత విషువత్కాలం అశ్విన్యాదిలో సంభవించడం చేత ఆనాటినుంచి ఉత్తరాయణం దేవమానదినం ప్రారంభం కావడం ప్రాచీన సాంప్రదాయం కనుక అదే వసంత కాల ప్రారంభంగాను, ఆనాడే సంవత్సర ప్రారంభంగాను నిర్ణయించి మాస ఋతు సామరస్యం చేసాడు. వసంత విషుత్కాలం చైత్రమాస ప్రారంభంగా పరిగణితమైందన్నమాట, కాని మనం ధర్మసింధు కారుడన్నట్టు శుక్ల ప్రతిపదాదినుంచి అమావాస్యతో ముగిసే కాలాన్ని నెలగా పరిగణిస్తున్నాము.నాటినుంచి నేటివరకు చైత్రమాసంలోనే ఉగాది పండుగ అనే ఆచారం ఏర్పడింది.
 
[[వరాహమిహిరుడు]] వసంత విషువత్తునుబట్టి ఋతుమాస సామరస్యం సాధించనేమో సాధించాడు.కాని అప్పటినుంచి వసంత విషువత్ 23 డిగ్రీలు వెనక్కు వస్తూ ఉంది.
 
 
 
మన ఉగాది చైత్ర మాసంతోనే ఎందుకు మొదలవుతుంది అనే ప్రశ్నకు హెమాద్రి పండితుడు:
"https://te.wikipedia.org/wiki/ఉగాది" నుండి వెలికితీశారు