ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 33:
 
==గాయనిగా తొలినాళ్ళు==
తొలినాళ్లలో ఏవీయం స్టూడియో గాయనిగా ఉండి, 1957లో [[టి.చలపతిరావు]] సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియిన్‌ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలయ్యింది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయింది. ఈ చిత్రంలో తన పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలా మొదలైన ఈమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాలగోపాలాన్నీ అలరింపజేసింది. తెలుగులో విజయవంతము అయిన ఎన్నో చిత్రాలకు పాటలు పాడింది. 1957వ సంవత్సరంలో తన కెరీర్‌ను ప్రారంభించిన జానకి.. [[తెలుగు]], [[తమిళం]], [[మలయాళం]], [[కన్నడ]] మున్నగు అనేక భారతీయ భాషలలో పాటలు పాడినది. జానకి పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత [[దర్శకురాలు]] కూడా. [[శ్రీ కృష్ణుడు|కృష్ణుని]],[[షిర్డీ సాయిబాబా]] భక్తురాలైన ఈమె చాలా సమయము పూజలలో గడుపుతుంది. అంతేకాక [[మీరా]] పై అనేక భక్తిగీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేసింది. [[ఉషా కిరణ్ మూవీస్]] వారి ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, [[భానుమతి]], [[లీల]] తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలిగా పేరు గడించింది.
 
పాటల్లో మిమిక్రి మిక్స్‌ చేసి సంగీతప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించింది. [[పదహారేళ్ళ వయసు]] చిత్రంలోని కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే.. పాటలో పండు ముసలావిడ గొంతు.. గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం... చిన్నారిపొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు.. శ్రీవారి శోభనం చిత్రంలోని `అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక` పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట పాడి తనది ఎవరూ గెలువలేని ప్రత్యేకత అని నిరూపించుకున్నది, జానకి. జానకి గొంతులో ఎన్నెన్నో భావాలు.. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత.. `ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది` అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం.. వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన.. `తొలిసారి మిమ్మల్ని చూసింది` అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఎన్నటికీ మరచిపోలేని రీతిలో ఉంటాయి. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. అదీ జానకి ప్రత్యేకత.
"https://te.wikipedia.org/wiki/ఎస్._జానకి" నుండి వెలికితీశారు