సాత్యకి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: కృష్ణుడుకృష్ణుడు (3)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File:Krishna as Envoy.jpg|thumb|కౌరవ సభలో కృష్ణునితో సాత్యకి]]
'''సాత్యకి'''కి యుయూధనుడు అను పేరు కూడా ఉంది. ఇతను [[శ్రీ కృష్ణుడు|కృష్ణునికి]] చెందిన [[వృషణి]] యాదవ వంశమునకు చెందిన మహా యోధుడు.
 
సాత్యకి [[శ్రీ కృష్ణుడు|కృష్ణుని]] భక్తుడు. ఇతను [[అర్జునుడు|అర్జునునితో]] కలసి [[ద్రోణుడు|ద్రోణుని]] వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను [[అర్జునుడు]] మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి [[సాత్యక]]. ఇతను [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[పాండవులు|పాండవులతో]] కలసి [[కౌరవులు|కౌరవులపై]] యుద్ధం చేసెను. [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] శాంతి రాయబారమునకు [[హస్తినాపురం]]నకు వచ్చునపుడు సాత్యకితో కలసి వచ్చెను.
 
సాత్యకి, [[కృతవర్మ]]లు [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పోరాడిన [[యాదవ]] వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి [[పాండవులు|పాండవుల]] వైపు, [[కృతవర్మ]] [[కౌరవులు|కౌరవుల]] వైపు పోరాడారు. యుద్ధంలో ఒకసారి [[ద్రోణుడు|ద్రోణుని]] విల్లుని 101 సార్లు విరచి అతనిని ఆశ్చర్యపరిచాడు. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకి తమకు చాలా కాలంగా కుటుంబ వైరం ఉన్న [[భూరిశ్రవుడు|భూరిశ్రవునితో]] యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. [[భూరిశ్రవుడు]] సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] [[అర్జునుడు|అర్జునునితో]] జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. [[భూరిశ్రవుడు]] సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో [[అర్జునుడు]] తన బాణంతో [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.
"https://te.wikipedia.org/wiki/సాత్యకి" నుండి వెలికితీశారు