పాణిని: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
అష్టాధ్యాయి పై అనేక వృత్తులు వచ్చాయి. పాణిని మేన మామ ''వ్యాడి'' అనే ఆయన వ్యాడి సంగ్రహం అనే పేర వృత్తి రాశాడు. [[విక్రమార్కుడు|విక్రమార్కు]]ని ఆస్థానంలో ఉన్న వరరుచి ఇంకో వృత్తి రాశాడు. జయాదిత్యుడు, [[వామనుడు]] కలిసి రాసిన వృత్తికి ''కాశికా వృత్తి'' అని పేరు. ఇదీ గొప్ప పేరు పొందినదే. వీరిద్దరూ [[కాశీ]]లో ఉండి రాయటం చేత ఆ పేరొచ్చింది. అతి ప్రధాన వృత్తిగా కాశికా వృత్తికి పేరుంది. దీని తర్వాత చెప్పుకో తగ్గది భర్తృహరి’ అనే పేరుతో పిలువ బడే ఎనిమిదో శతాబ్దానికి చెందిన బౌద్ధ పండితుడు విమలమతి రాసిన భాగ వృత్తి. 16వ శతాబ్దం వాడైన అప్పయ్య దీక్షితులు సూత్ర ప్రకాశిక అనే వృత్తి రాశాడు. [[దయానంద సరస్వతి]] అష్టాధ్యాయీ భాష్యం అనే ప్రసిద్ధ గ్రంథం రాసి సుసంపన్నం చేశాడు.
 
పాణిని తర్వాత చాలా మంది వ్యాకరణాలు రాశారు. అందులో కాతంత్ర కారుడు, చంద్ర గోమి, క్షపణకుడు, దేవా నంది, వామనుడు, అకలంక భట్టు, పాల్య కీర్తి, శివ స్వామి భోజ రాజు, బోపదేవుడు మొదలైన వారెందరో ఉన్నారు. ఇందరు రాసినా పాణినీయానికి ఉన్న ప్రాచుర్యం దేనికీ రాలేదు. పాణిని అష్టాధ్యాయి 19వ శతాబ్దంలో యూరోప్ భాషా శాస్త్రవేత్తలను విశేషంగా ప్రభావితం చేసింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషల వ్యాకరణ అభివృధ్ధిలో పాణిని భాషా నిర్మాణ సూత్రాలు ఉపయోగించబడ్డాయి.f
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/పాణిని" నుండి వెలికితీశారు