చి నేను రాసిన వ్యాసానికి విలువ దయచేసి విలువ ఇవ్వండి.
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 277:
== విషయ ప్రాధాన్యత ==
[[వాడుకరి:Chaduvari|చదువరి]] గారు, విషయ ప్రాధాన్యత లేదు అని నేను రాసిన వ్యాసాన్ని తొలగించు మూస పెట్టలేదు. వికీపీడియాలో ఈ వ్యాసాన్ని విషయ ప్రాధాన్యత లేదని చర్చించిన తర్వాత కద తొలగించాలి. విషయ ప్రాధాన్యత మూలం ఉంది. గత 16 సంవత్సరాలు ఈ వాడుకరి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు, కొత్త వాడుకరులను ఎలా నిలబడాలని ఎన్నో సూచనలతో పేజీలను సృష్టిస్తున్నారు. విషయ ప్రాధాన్యత ఎందుకు లేదని మీరు తొలగించారు, అలాంటి వ్యాసాన్ని ఎందుకు తెలుగు వికీపీడియాలో రాస్తాను, గత ఐదు సంవత్సరాలు అనుభవం అనే నేను విషయ ప్రాధాన్యత ఈ వ్యాసాన్ని ఉంది కాబట్టే రాశాను. అందుకు 100 అంశాలను ఉదాహరణ ఇవ్వగలను, ఆ వ్యాసం ఎవరిది అనేది ముఖ్యం కాదు ఇక్కడ విషయ ప్రాధాన్యత ఉంది అని నేను రాశాను. కాదని విషయ ప్రాధాన్యత లేదు అని ఆ వ్యాసానికి ఇతర వాడుకరును చెప్పమనండి. వ్యాసం రాసిన వ్యక్తి తెలుగు వికీపీడియా లో లో సుమారు 100 వ్యాసాలు రాశాడని మీకు తెలుసు అజ్ఞాత వాడుకరి రాసిన వ్యాసంలా తొలగించడం, నన్ను బాధించింది. దయచేసి వ్యాసాన్ని తిరిగి పునరుద్ధరించ గలరు, లేనిచో నేను రాసిన వ్యాసానికి మీరు విలువ ఇవ్వని ఎడల ఈరోజు నుండి వికీపీడియా నుండి రచనలకు దూరంగా ఉండాలని, అని భావిస్తున్నాను. ఆ వ్యాసాన్ని తిరిగి దయచేసి పునరుద్ధరించాలని నా అభ్యర్థన మన్నించండి లేనిచో తెలుగు వికీ నుండి నన్ను దూరం చేయండి అంతా మీ చేతుల్లోనే ఉంది. నేను నేను మరి కొన్ని వ్యాసాలు రాశాను, వాటిని కూడా నిర్వాహకులు వాటిని కూడా తొలగిస్తే అని కూడా ఆలోచించండి. ధన్యవాదాలు. __[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="Blue"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> చర్చ </font>]]</sup> 04:31, 24 ఫిబ్రవరి 2021 (UTC)
:[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|ప్రభాకర్]] గారూ, ఈ విషయానికి సంబంధించి నా ఆలోచనలు:
:# వికీలో విషయ ప్రాధాన్యత గురించి మీకున్న అవగాహనను నేను తక్కువగా భావించడం లేదు. అలాగే, దాని పట్ల నాకున్న అవగాహన కూడా తక్కువని నేను భావించడం లేదు. (ఈ సంగతిని మీరు కూడా గుర్తించాలని నా విజ్ఞప్తి). కాబట్టి విషయ ప్రాధాన్యత పట్ల ఉన్న అవగాహన విషయంలో మనిద్దరం సమానమేనని అనుకుందాం.
:# ఇకపోతే నాకున్న ప్రశస్తి, ప్రాముఖ్యత, ప్రాధాన్యత లేంటో నాకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆ విధంగా మీకంటే నాకెక్కువ తెలుసు. కాబట్టి నా అభిప్రాయమే మెరుగు. దీనిపై చర్చించాల్సిన అవసరమే లేదు. నాకు వికీకెక్కేంతటి స్థాయి లేదు.
:# పై కారాణాల వల్ల ఆ పేజీని తొలగించడం సబబే. కానీ మీకు బాధ కలిగించినందుకు సారీ. అజ్ఞాతలు రాసినవాటి విషయంలో తప్ప నేను సాధారణంగా అలా చెయ్యను. కానీ, ఇది నా గురించి రాసిన పేజీ కాబట్టి, అందులో చర్చించేదేమీ లేదు కాబట్టి, అలా చేసాను. ఆ పేజీని ఉండనిస్తే నాకు వికీ-ప్రాధాన్యత ఉందని నేను అంగీకరించినట్టే. అర్హత లేదని తెలిసినా కూడా నాకు పేజీ ఉండడం నేను భరించలేను.
:పోతే, విలువ ఇవ్వాల్సింది వ్యాసానికి, అది ప్రథమం. ఎవరు రాసారనేది ద్వితీయం. మీరు బాధపడకండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:12, 24 ఫిబ్రవరి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chaduvari" నుండి వెలికితీశారు