సహాయం:పరిచయం/ఎడిటరును ఎంచుకోండి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేఝీ
(తేడా లేదు)

08:33, 24 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

ఈ పాఠాలు చదివే ముందు మీ అభిరుచుల గురించి కొంత


దిద్దుబాటు అభిరుచులను ఇలా అమర్చుకోవాలి

మీ "అభిరుచులు"లో దిద్దుబాటు ట్యాబులో చేసుకున్ని కొన్ని అమరికలను బట్టి ఈ పాఠాల లోని పాఠ్యం, బొమ్మలు మీరు చూసే వికీ పేజీలకు సరిపోలుతాయి. వికీపీడియా ప్రధానంగా రెండు రకాల ఎడిటర్లను అందిస్తుంది - వికీటెక్స్టు ఎడిటరు, విజువల్ ఎడిటరు. వికీటెక్స్టు ఎడిటరులో మళ్ళీ రెండు రకాల పరికరాల పట్టీలున్నాయి. ఏ ఎడిటరును, ఏ పరికరాల పట్టీని ఎంచుకున్నారనేదాన్ని బట్టి మీ ఎడిటరుకు ఈ పాఠాల్లోని బొఇమ్మలకు పోలికలుంటాయి.

ఎడిటరును ఎంచుకోండి

కింది విధంగా మీ ఎడిటరును ఎంచుకోండి:

  1. పేజీకి పైన కుడివైపున ఉండే లింకుల్లోని అభిరుచులు పేజీకి వెళ్ళండి
  2. అక్కడ దిద్దుబాట్లు ట్యాబుకు వెళ్ళండి
  3. అందులో "సవరణ టూల్ బార్ సచేతనం" లో టిక్కు పెట్టండి
  4. "సవరణ విధం" డ్రాప్‌డౌను పెట్టెలో కింది వికల్పాలుంటాయి
    1. కిందటిసారి వాడిన ఎడిటరునే గుర్తుంచుకో
    2. వీలైతే అన్నివేళలా విజువల్ ఎడిటరునే ఇవ్వు
    3. ఎల్లప్పుడూ వికీపాఠ్యం ఎడిటరునే ఇవ్వు
    4. దిద్దుబాటు ట్యాబ్‌లు రెంటినీ చూపించు
  5. పైవాటిలో
    1. మొదటిది ఎంచుకుంటే మీరు కిందటిసారి వాడినదాన్నే మళ్ళీ చూపిస్తుంది
    2. విజువల్ ఎడిటరు చేతనమై ఉన్న పేజీలన్నిటిలో దాన్నే చూపిస్తుంది. మిగతా పేజీల్లో వికీపాఠ్యం ఎడిటరును చూపిస్తుంది
    3. ఏ పేజీలో నైనా వికీపాఠ్యం ఎడిటరునే చూపిస్తుంది
    4. దీన్ని ఎంచుకుంటే పేజీలో చదువు అనే ట్యాబు పక్కన సవరించు, మూలపాఠ్యం సవరించు అనే ట్యాబులు రెండు కనిపిస్తాయి

సవరించు నొక్కి పేజీని దిద్దుబాటు స్థితిలో తెరిచినపుడు, పైవాటిలో మీరు ఏది ఎంచుకుంటే ఆ ఎడిటరు డిఫాల్టుగా కనిపిస్తుంది, అయితే వెంటనే రెండో ఎడిటరుకు మారే సౌకర్యం కూడా ఎడిటరు లోనే ఉంటుంది. పక్కనున్న బొమ్మ చూడండి

మా సలహా: కొత్తవారు కాబట్టి, విజువల్ ఎడిటరునే ఎంచుకొమ్మని మేం మీకు సలహా ఇస్తున్నాం. అది ఇంద్రియ సహజంగా ఉంటుంది. అంచేత వాడడం తేలిక.