కృష్ణకుమారి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ె → ే (2), , → , (3)
పంక్తి 50:
1963లో [[లక్షాధికారి]], [[బందిపోటు]], [[ఎదురీత]], [[కానిస్టేబుల్ కూతురు]] చిత్రాల్లో వైవిధ్యం ఉన్న పాత్రలు వేశారు. ప్రభుత్వ బహుమతి పొందిన జగపతీ పిక్చర్స్ వారి [[అంతస్థులు]]లో నాయికగా నటించారు. 1967-68 మధ్యకాలంలో [[ఉమ్మడి కుటుంబం]], [[భువనసుందరి కథ]], [[రహస్యం]], [[చిక్కడు దొరకడు (1967 సినిమా)|చిక్కడు దొరకడు]], [[స్త్రీ జన్మ]] వంటి చిత్రాలలో వైవిధ్యమున్న పాత్రలు పోషించారు. [[వరకట్నం]]లో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాలలో నటించగలిగారు.
 
మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 150 సినిమాలలో నటించింది. వీనిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే, 15 కన్నడ చిత్రాలు, కొన్ని తమిళ భాషా చిత్రాలు. మూడు భాషల చిత్రాల్లోనూ ఆమే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈమె ఆనాటి [[నందమూరి తారక రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]], [[కృష్ణంరాజు]], [[జగ్గయ్య]], హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించింది. కాంతారావుతో కలిసి 28 జానపద చిత్రాల్లో నటించింది.
 
బాలీవుడ్ లో కిశోర్ కుమార్ తో ఒకే ఒక సినిమాలో కథానాయికగా నటించింది. అప్పటికి హిందీ చిత్ర పరిశ్రమలో కృష్ణకుమారి పేరుతో వేరే నటి ఉండటంతో రతి అనే పేరుతో పరిచయం అయింది. దాని తర్వాత బాలీవుడ్ లో పలు అవకాశాలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమను వదిలి వెళ్ళలేదు. 1963 లో కృష్ణకుమారి 16 సినిమాల్లో కథానాయికగా నటించింది. ఒక్క ఏడాదిలో అత్యధిక సినిమాల్లో కథానాయికగా నటించడంలో ఆమె రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇందుకోసం ఈమె మూడు నెలలపాటు మూడు షిఫ్టులు ఖాళీ లేకుండా పనిచేసింది.
"https://te.wikipedia.org/wiki/కృష్ణకుమారి_(నటి)" నుండి వెలికితీశారు