ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
ఇతడు హెచ్చు శృతిలో, భావయుక్తంగా, పాడిన ప్రతి పాటను ఆవేశంతో పాడేవాడు. అనేక కీర్తనలకు ఇతడి పాఠాంతరాలు తమదైన ముద్రను కలిగి ఉండి వాటిని అతని శిష్యబృందం ఆలపించినప్పుడు సులభంగా గుర్తించ గలిగేవారు. ఇతడు నెరవల్ ఆలాపనలోను, విలంబ సంగీతంలోను నిపుణుడిగా పేరుపొందాడు. ఇతని సమకాలీకుడైన [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]] ఇతడిని తమ వృత్తికి గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా ప్రశంసించాడు.
 
ఇతడు గాయకునిగానే కాకుండా సంగీత గురువుగా కూడా ప్రశంసలందుకున్నాదు. ఇతడు ఇంటి వద్ద అనేక మంది శిష్యులకు తర్ఫీదునిచ్చాడు. ఇతని "శిష్య పరంపర" బాగా గుర్తింపును తెచ్చుకుంది. ఇతడూ కీర్తనలు నేర్పించే తీరు "ముసిరి స్కూల్" గా పిలువబడింది. ఇతని శిష్యులలో ఎన్.రాజం, ముసిరి ఎం.ఆర్.గోపాలరత్నం, [[టి.కె.గోవిందరావు]], [[బాంబే సిస్టర్స్]] [[సి.సరోజ]] & [[సి.లలిత]], తైలంబ కృష్ణన్, [[మణి కృష్ణస్వామి]], కె.ఎస్.వెంకటరామన్, సుగుణా పురుషోత్తమన్, సుగుణా వరదాచారి మొదలైన వారున్నారు. కె.గాయత్రి, విద్యా కళ్యాణరామన్, ప్రసన్న వెంకట్రామన్, జయం వెంకటేశ్వరన్ మొదలైన వారు ఇతని బాణీని అనుసరిస్తున్నారు.
 
==అవార్డులు==