వరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 30:
సందీప్ 'శాండీ' ( [[అల్లు అర్జున్]] ) రేపటి తరం యువకుడు. అతను ఆధునిక దృక్పథం కలిగి ఉంటాడు. కాని పెళ్ళి పట్ల అతని ఆలోచనలు సాంప్రదాయికంగా ఉంటాయి. అతను యుఎస్ఎలో ఉద్యోగం వచ్చినప్పుడు, అతని తల్లిదండ్రులు వసుంధర ( [[సుహాసిని]] ), రాజ్ గోపాల్ ( [[ఆశిష్ విద్యార్థి]] ) అతన్ని పెళ్ళి చేసుకొమ్మని అడుగుతారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుని వారివారి తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్నారు. వారు ఎంపిక చేసిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాననీ, పెళ్ళినాటి వరకు అమ్మాయిని చూడను కూడా చూడననీ ఐదు రోజుల పాటు పెళ్ళి చెయ్యాలనీ అతడు అడుగుతాడు. అతని ఇష్టాలకు అనుగుణంగా ప్రతిదీ ఏర్పాటు చేస్తారు. అతని పెళ్ళి దీప్తి ( [[భానుశ్రీ మెహ్రా|భాను శ్రీ మెహ్రా]] ) తో నిశ్చయమౌతుంది. వేడుకలో, శాండీ దీప్తి ఒకరినొకరు చూసుకున్నప్పుడు, వారు మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. దీప్తిని దివాకర్ ( [[ఆర్య(నటుడు)|ఆర్య]] ) అనే స్థానిక గూండా కిడ్నాప్ చేస్తాడు. శాండీ తల్లిదండ్రులు అతనిని మరొకరిని పెళ్ళి చేసుకొమ్మని ఒప్పించటానికి ప్రయత్నిస్తారు. కాని అతను నిరాకరించి తన వధువును కనుగొనటానికే ప్రయత్నిస్తాడు.
 
అతను దీప్తి ఆచూకీ తెలుసుకుంటాడు. గతంలో ఒకసారి బహిరంగంగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమె అతణ్ణి చెంపదెబ్బ కొడుతుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి దివాకర్ దీప్తిని కిడ్నాప్ చేశాడు. దివాకర్, అతని అనుచరులూ పోలీసులను చంపుతారు. శాండీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని దివాకర్ సోదరుడిని కిడ్నాప్ చేసి తన వధువును రప్పించుకుంటాడు. ఈ గొడవలో, చేతనైతే తన పెళ్ళిని అడ్డుకోమని అతను దివాకర్‌ను సవాలు చేస్తాడు, దానికి అతను అంగీకరిస్తాడు. అన్ని ఆచారాలతో శాండీ దీప్తి విజయవంతంగా పెళ్ళి చేసుకుంటారు.<ref>{{cite web|url=https://filmywap.one/allu-arjun-to-team-up-with-gautham-vasudev-menon-for-a-kollywood-project/|title=Allu Arjun To Team Up With Gautham Vasudev Menon For A Kollywood Project|last1=Starhub|first1=Rock|website=Filmywap|publisher=Rockstarhub|access-date=23 February 2021}}</ref> వారు మండపం నుండి బయటికి వచ్చినప్పుడు, దివాకర్ శాండీపై దాడి చేస్తాడు. ఒక పోరాటం జరుగుతుంది, ఇందులో శాండీ దివాకర్‌ను చంపేస్తాడు. శాండీ దీప్తి సంతోషంగా జీవిస్తారు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/వరుడు" నుండి వెలికితీశారు