వి.రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
}}
 
'''వి.రామకృష్ణ''' (విస్సంరాజు రామకృష్ణదాసు) ([[ఆగష్టు 20]], [[1947]] - [[జూలై 16]], [[2015]]) (V. Ramakrishna) 1970 వ దశకములో పేరొందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో ఈయన 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు. రామకృష్ణ పాటలు పాడిన కొన్ని చిత్రాలు [[తాతామనవడు]], [[భక్తతుకారాం]], [[శారద]], [[కృష్ణవేణి]], [[అల్లూరి సీతారామరాజు]], [[ముత్యాల ముగ్గు]], [[అందాలరాముడు]], [[భక్త కన్నప్ప]], [[దానవీరశూర కర్ణ]], [[మహాకవి క్షేత్రయ్య]], [[అమరదీపం]], [[శ్రీమద్‌విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర]], శ్రీషిర్డీసాయిబాబా మహత్యం, బలిపీఠం, [[గుణవంతుడు]], [[కరుణామయుడు]]. ఈయన [[అక్కినేని నాగేశ్వరరావు]], [[ఎన్టీ రామారావు]], [[శోభన్ బాబు]], [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]] వంటి నటులకు పాడారు. [[కె.వి.మహదేవన్]], [[పెండ్యాల]] వంటి సంగీతదర్శకులతో పనిచేశారు.
 
''అపర ఘంటసాల''గా పేరొందిన రామకృష్ణ తొలుత చెన్నైలో స్థిరపడినా.. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమ తరలిరావడంతో వారితోపాటు.. తాను కూడా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. రామకృష్ణ దాదాపు 5000లకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన భక్తిగీతాల అల్బాలు విశేష ఆదరణ పొందాయి.
"https://te.wikipedia.org/wiki/వి.రామకృష్ణ" నుండి వెలికితీశారు