ట్యాగు: MassMessage delivery
పంక్తి 972:
::[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. అనువాదాల విషయంలో నిర్భందాలకు నేను వ్యతిరేకమన్న సంగతి మీరు గ్రహించారు అనుకుంటున్నాను. బహుశా మీరు చిన్న వ్యాసాలను, ఆంగ్లంలో మంచి నాణ్యతకు చేరుకోని వ్యాసాలను అనువదించుతున్నారు కాబట్టి మీకు వికీకోడ్(మార్కప్) పెద్ద అడ్డంకిగా లేదనుకుంటాను. అలాగే అనువాదం ఉపకరణం అంతర్వికీ వ్యాస లింకులు, వర్గాల లింకులు వికీడేటా ద్వారా చేర్చటం కూడా మీకు ఉపయోగంగా అనిపించివుండవచ్చు. అయితే మీ అనువాదాలు మరింత నాణ్యతగా వుండాలంటే కొన్ని సూచనలు చేయదలచుకున్నాను. మీరు ఆంగ్ల వ్యాసం నకలు చేసినప్పుడు ఆంగ్ల వ్యాసం శాశ్వత లింకు సారాంశంలో చేర్చండి. తరువాత ఆంగ్ల వ్యాసం మార్పులకు లోనైతే, తెలుగు వ్యాసంలో మార్పులు చేయాలనుకున్నప్పుడు, ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. మీరు అనువదించిన కొన్ని ఆంగ్ల వ్యాసాలలో చాలా లింకులకు {{tl|Cite web}} వాడలేదు. వాటికై మీరు తెలుగులో ఆ మూస వాడి మూలాన్ని మరింత వివరంగా చేర్చితే బాగుంటుంది. ఇంకొకటి: ఒక్కటైనా తెలుగు మూలాన్ని చేర్చి వ్యాసాన్ని విస్తరించడం, ఇతరులు భవిష్యత్తులో ఆ వ్యాసాన్ని మరింతగా మెరుగు చేయడానికి దోహదపడుతుంది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 22:06, 17 ఫిబ్రవరి 2021 (UTC)
:::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]]గారూ! మీ సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.--[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 00:07, 18 ఫిబ్రవరి 2021 (UTC)
 
== వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు ==
 
వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, [[:m:Wikimedia Foundation Board of Trustees/Call for feedback: Community Board seats|కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు]]. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.
 
రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. [[User:KCVelaga (WMF)|KCVelaga (WMF)]], 11:24, 1 మార్చి 2021 (UTC)
<!-- Message sent by User:KCVelaga (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:KCVelaga_(WMF)/Targets/Telugu_volunteers&oldid=21164917 -->