కె. ఎస్. చిత్ర: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎బాల్యం, విద్యాభ్యాసం: కె.ఓమనకుట్టి కి లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 31:
చిత్ర అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి శాంతకుమారి ఇద్దరి పేర్లు పూర్తి పేరులో ఉన్నాయి.<ref name="eenadu">{{Cite web|url=https://www.eenadu.net/sundaymagazine/article/321000133|title=పిల్లల కోసమే అక్కడికి వెళ్తా..! - Sunday Magazine|website=www.eenadu.net|language=te|access-date=2021-02-07}}</ref> ఈమె [[1963]], [[జూలై 27]]న [[కేరళ]]లోని [[తిరువనంతపురము]]లో, సంగీతకారుల కుటుంబంలో జన్మించింది. బాల్యంలో తండ్రి దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. చిత్ర అక్క బీనా, తమ్ముడు మహేష్. వీరి తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒకరిని సంగీతంలోకి పంపాలనే కోరికగా ఉండేది. అందుకుగాను బీనాకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అక్క సాధన చేసేటపుడూ చిత్ర కూడా ఆమెతో పాటు స్వరాలు పాడేది. చిన్నతనంలో ఉండగానే [[ఆకాశవాణి|ఆలిండియా రేడియో]]లో రెండేళ్ళ కృష్ణుడికి ఈమె చేత పాట పాడించారు. ఆమె తొలి రికార్డింగ్ అదే.<ref name="eenadu"/>
 
చిత్ర పూర్తి స్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కోరికమేరకు కేంద్రప్రభుత్వం అందించే ''నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్ షిప్'' కి దరఖాస్తు చేసుకుంది. కానీ అందుకోసం అప్పటి వరకే రెండేళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. కానీ ఆమెకు అప్పటిదాకా ఉన్న సంగీత పరిజ్ఞానంతో అందుకు దరఖాస్తు చేసింది. ఎంపికలో భాగంగా ఆమె న్యాయనిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాజ కృతిని పాడింది. అందులో ఆమెకు తెలియకుండానే అసావేరి రాగంలో ఒక ప్రయోగం చేసింది. ఆమె ప్రతిభను గమనించిన న్యాయనిర్ణేతలు ఉపకారవేతనానికి ఎంపిక చేశారు. అలా ఆమె 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంతో డా. [[కె.ఓమనకుట్టి|కె. ఓమనకుట్టి]] వద్ద [[కర్ణాటక సంగీతము]]లో విస్తృతమైన శిక్షణ పొందింది.
 
== సినిమా కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._చిత్ర" నుండి వెలికితీశారు