వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

→‎పాఠ్యం (కంటెంటు): కొన్ని అక్షర దోషాలు సవరించాను
దిద్దుబాటు సారాంశం లేదు
(→‎పాఠ్యం (కంటెంటు): కొన్ని అక్షర దోషాలు సవరించాను)
ట్యాగు: 2017 source edit
నిజమైన, పనికొచ్చే సమాచారం అనే ఏకైక కారణంతో వికీపీడియాలో పెట్టెయ్యకూడదు. అలాగే లభిస్తున్న ప్రతీ ఒక్క సమాచారాంశాన్నీ ఇక్కడ పెట్టెయ్యకూడదు, విషయానికి సంబంధించిన సారాంశాన్ని మాత్రమే ఇక్కడ రాయాలి. వికీపీడియాకు తగని పాఠ్యమేదో కింద ఇవ్వబడినవి కొన్ని ఉదాహరణలు.
=== వికీపీడీయా నిఘంటువు కాదు ===
వికీపీడీయా నిఘంటువు కాదు. పారిభాషిక పదకోశమూ కాదు. దీనికోసం వికీ సోదర ప్రాజెక్టు [http://te.wiktionary.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80] విక్షనరీ] ఉంది. మీకు ఆసక్తి ఉంటే విక్షనరీలో చేయూత నివ్వండి.సహాయం చేయండి. విక్షనరీ ఇటీవలి మార్పులు కోసం [https://te.wiktionary.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%B5%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81] ఇక్కడ] చూడండి.
: వికీపీడియా వ్యాసాలు:
# '''నిర్వచనాలు చెప్పే నిఘంటువు కాదు'''. వికీపీడియా నిఘంటువు కాదు కాబట్టి, కేవలం పదానికి నిర్వచనం రాసేందుకు గానుమాత్రమే పేజీ సృష్టించకండి. కొన్ని విషయాలకు సంబంధించి వ్యాసం నిర్వచనంతోటే మొదలు కావాల్సి రావడం తప్పనిసరి కావచ్చు. నిర్వచనం తప్ప మరేమీ లేని వ్యాసం మీ దృష్టికి వచ్చినపుడు ఆ పేజీలో ఇంకేమైనా రాయగలరేమో చూడండి. సంఖ్యలకు ఇచ్చే సాంస్కృతిక అర్థాలు దీనికి మినహాయింపు.
# '''అలాంటి నిర్వచనాల జాబితా కూడా కాదు'''. అయితే, [[వికీపీడియా:అయోమయ నివృత్తి|అయోమయ నివృత్తి]] కోసం ఒక పదానికి చెందిన సమానార్థకాల జాబితా పెట్టవచ్చు. కొన్ని ప్రత్యేక రంగాలకు సంబంధించిన పదాల కోశం కూడా వికీపీడియాలో పెట్టవచ్చు.
# '''వినియోగ మార్గదర్శిని''' గానీ, '''వాడుకపదాలు, జాతీయాల మార్గదర్శిని''' గానీ కాదు. వికీపీడియా పదాలను, జాతీయాలను ఎలా వాడాలో చెప్పే మార్గదర్శిని కాదు. ఎలా మాట్లాడాలో ప్రజలకు శిక్షణనిచ్చే స్థలం కాదు.
# '''[[ప్రస్తుత ఘటనలు|ప్రస్తుత ఘటనలపై]] అభిప్రాయాలు''': పై విషయానికే చెందిన ఓ ప్రత్యేక సందర్భం ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలు ఇక్కడ వెల్లడించరాదు.
# '''చర్చా వేదికలు''': ఇక్కడ మనం చేసే పని విజ్ఞాన సర్వస్వం తయారు చెయ్యడం. దానికి సంబంధించిన చర్చ కోసం సభ్యుల లేదా వ్యాసపు చర్చాపేజీలను వాడండి. అది కూడా వ్యాసాన్ని ఎలా మెరుగు పరచాలనే విషయానికే పరిమితం చెయ్యండి. ఏ చర్చనైనా వ్యాసాల్లో చెయ్యకండి.
# '''జర్నలిజము''': వికీపీడియా ఎప్పటికప్పుడు వేడివేడిగా వార్తలందించే వార్తా వెబ్సైటువెబ్‌సైటు కాదు.
 
=== వికీపీడీయా ప్రచార వాహనం కాదు ===
వికీపీడియా ప్రచార వాహనం కాదు. కాబట్టి వికీపీడియా..
# '''ప్రచార వేదిక కాదు''': వికీపీడియా ఎదైనాఏదైనా విషయాన్ని ప్రచారం చేసే వేదిక కాదు.
# '''సొంత డబ్బా కాదు''': మీ గురించి, మీరేం చేసారు, చేస్తున్నారు, ఏయే ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు మొదలైనవి రాసుకునే వీలు వికీపీడియాలో ఉన్నప్పటికీ, అన్ని పేజీలకు లాగానే ఆ పేజీలు కూడా విజ్ఞాన సర్వస్వం ప్రమాణాలు పాటించాలని గుర్తుంచుకోండి. మరీ అతిగా లింకులు ఇచ్చుకోవడం వంటివి చెయ్యరాదు.
# '''వ్యాపార ప్రకటనా స్థలం కాదు''': సంస్థలు, ఉత్పత్తుల గురించి వ్యాసాలు రాయవచ్చు. అయితే అవి నిష్పాక్షికంగా, విషయ ప్రధానంగా ఉండాలి. వ్యాసంలోని విషయాలన్నీ నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా ఉండాలి. అంచేతనే, చిన్న చితకా సంస్థల గురించి రాసిన వ్యాసాలు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. వ్యాస విషయానికి సంబంధించినవైతే సంస్థల వెబ్ సైట్లకువెబ్‌సైట్లకు బయటి లింకులు కూడా ఇవ్వవచ్చు. వికీపీడియా ఏ వ్యాపార సంస్థకు గానీ, వ్యాపారానికి గానీ ప్రచారం చెయ్యదు.
 
=== వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు ===
# '''అంతర్గత లింకుల సమాహారం కాదు''': అయోమయ నివృత్తి పేజీలు తప్పించి, ఏ పేజీ కూడా అంతర్గతలింకుల జాబితా లాగా ఉండకూడదు.
# '''సార్వజనికమైన వనరుల సంగ్రహం కాదు''': చారిత్రక దస్తావేజులు, పుస్తకాలు, ఉత్తరాలు, చట్టాలు మొదలైన వాటి పూర్తి పాఠాలను యథాతథంగా వికీపీడియా వ్యాసాల్లో పెట్టరాదు. అలాంటి పూర్తి పాఠాలు పెట్టేందుకు అనువైన స్థలం వికీసోర్సు. అయితే అలాంటి సార్వజనిక వనరుల లోని విషయాలను వికీపీడియా వ్యాసాల్లో వాడుకోవచ్చు.
# '''ఏ వ్యాసానికీ సంబంధం లేని ఫోటోలు, బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళ సంగ్రహం కాదు''': వ్యాసానికి సంబంధం లేని, వివరాలేమీ లేని ఫొటోలు, బొమ్మలను ఇక్కడ ఎక్కించవద్దిఎక్కించవద్దు. అలాంటి వాటిని వికీమీడియా కామన్స్ లో పెట్టండి.
 
=== వికీపీడియా ఉచితంగా స్పేసు ఇచ్చే వెబ్ హోస్టువెబ్‌హోస్టు కాదు ===
వికీపీడియాలో మీ సొంత వెబ్ సైటువెబ్‌సైటు, బ్లాగు, వికీ మొదలైనవి పెట్టరాదు. వికీ టెక్నాలజీ వాడి ఏదైనా చెయ్యాలని మీకు ఆసక్తి ఉంటే దానికి [[:en:List_of_wiki_farms|చాలా సైట్లున్నాయి]] (ఉచితంగా గానీ, డబ్బులకు గానీ). అలాగే మీరే స్వంత సర్వరులో [http://wikipedia.sourceforge.net/ వికీ సాఫ్టువేరును స్థాపించుకోవచ్చు]. వికీపీడియా-
# '''మీ వ్యక్తిగత పేజీలు కాదు''': [[వికీపీడియా:వికీపీడియనులు|వికీపీడియనులకు]] తమ స్వంత పేజీలున్నాయి. కానీ వాటిని తమ వికీపీడియా పనికి సంబంధించిన వాటికి మాత్రమే వాడాలి. వికీయేతర పనుల కోసం పేజీలు అవసరమైతే ఇంటర్నెట్లో దొరికే అనేక ఉచిత సేవలను వాడుకోండి.
# '''ఫైళ్ళు దాచిపెట్టుకునే స్థలం కాదు''': వ్యాసాలకు అవసరమైన ఫైళ్ళను మాత్రమే అప్‌లోడు చెయ్యండి; అలా కానివి ఏవైనా సరే తొలగిస్తారు. మీ దగ్గర అదనంగా బొమ్మలుంటే వాటిని కామన్స్ లోకి అప్‌లోడు చెయ్యండి, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.
#'''ఒరిజినల్ రిపోర్టులు కూడదు''': వికీపీడియా తాజావార్తలను ప్రచురించే పత్రిక కాదు.
#'''వార్తల నివేదిక కాదు''': వికీపీడియా పత్రికల్లో వచ్చిన వార్తల నివేదికను ప్రచురించే స్థలం కాదు. వార్తల ప్రాముఖ్యతను బట్టి వాటికి వికీ వ్యాసాల్లో చోటు కల్పించవచ్చు. ఉదాహరణకు "రేపు భారత ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్ పోటీ జరగనుంది" అనే వార్తను వికీలో పెట్టాల్సిన పనిలేదు. కానీ "భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి లక్ష్యిత దాడులు చేసింది" అనే వార్తకు ఆ ప్రాముఖ్యత ఉంది.
#'''''ఎవరెవరు ఎంతెంతవారు''' అనే జాబితా కాదు'''. సంఘటన ముఖ్యమైనంత మాత్రాన అందులో ప్రమేయమున్న ప్రతీ ఒక్కరూ అంత ముఖ్యమైనవారు కాకపోవచ్చు.
# '''దైనందిని కాదు''': వ్యక్తులు ముఖ్యమైనవారే అయినప్పటికీ, వారికి ప్రమేయమున్న ప్రతీ సంఘటనా ముఖ్యమైనదే కానక్కరలేదు. "ఇస్రో డైరెక్టరు మానవ సహిత యాత్ర తేదీని ప్రకటించారు" అనే వార్త వికీపీడియార్హమే. అంత మాత్రాన, "ఇస్రో డైరెక్టరు తన స్నేహితుడి కూతురు పెళ్ళికి రామాపురం వచ్చారు" అనేది కాదు.
'''భావి ఘటనలు''' విజ్ఞాన సర్వస్వంలో భాగం కావు. జరిగేదాకా అసలవి జరుగుతాయో లేదో చెప్పలేని ఘటనలైతే మరీను.
# '''ఘటనా క్రమాన్ని ముందే నిర్ణయించినంత మాత్రాన''' ఆ ఘటనలు వ్యాసాలుగా పనికిరావు: ఉదాహరణకు 2028 ఒలింపిక్స్ గురించి ఇప్పటి నుండే వ్యాసం రాయడం సమంజసంగా ఉండదు. వచ్చే సంవత్సరం కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అన్నంత ఖచ్చితంగా జరిగే ఘటనల గురించి రాయవచ్చేమోగానీ, ఇలాంటి విషయాల మీద వ్యాసాలు కూడదు.
# అలాగే భవిష్యత్తులో ఫలానా ఘటన జరిగితే ఈ పేరు పెడదాం అని ముందే పేర్లు నిర్ణయించుకుని పెట్టే విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాలకు వ్యాసాలు రాయరాదు. ఉదాహరణకు తుపానులకుతుఫానులకు పేర్లు పెట్టే పద్ధతి. 2010లో వచ్చే తుపానులకు ఫలానా పేర్లు పెడదాం అని ముందే పేర్ల జాబితా తయారు చేసి పెట్టుకుంటారు. ఎలాగూ పేర్లు పెట్టేసారు కదా అని వ్యాసాలు రాసెయ్యకూడదు.
# '''భవిష్యత్తు గురించిన లెక్కలు, ఊహలు, "భవిష్యత్తు చరిత్రల"''' గురించి చెప్పే రచనలు వికీపీడియాలో కూడవు. ఇవి మౌలిక పరిశోధన కిందకి వస్తాయి. అయితే అలాంటి తార్కిక, సంబద్ధ వ్యాసాల ''గురించి'' వికీపీడియాలో రాయవచ్చు. స్టార్ వార్స్ గురించి వ్యాసం రాయవచ్చు కానీ "నాలుగో ప్రపంచ యుద్ధంలో వాడబోయే ఆయుధాలు" అనే వ్యాసానికిక్కడ చోటులేదు.
 
33,540

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3148427" నుండి వెలికితీశారు