రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: రాముడురాముడు (2)
చి చిన్న మార్పులు
పంక్తి 1:
రామాయణము
[[భారత దేశం|భారతీయ]] వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని [[సంస్కృత భాష|సంస్కృతము]] లో రచించిన [[వాల్మీకి]] మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 1500క్రీ. BCపూ.1500 లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది
<ref>Lecture 34: Rewritings / Retellings of Indian Epics II: Ramayana</ref><ref>History of Ancient India: Earliest Times to 1000 A. D., Radhey Shyam Chaurasiya p. 38: "the Kernel of the Ramayana was composed before 500 B.C. while the more recent portion were not probably added till the 2nd century B.C. and later."</ref>. రామాయణం కావ్యంలోని కథ [[త్రేతాయుగం]] కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు. భారతదేశం లోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. [[ఇండొనీషియా]], [[థాయిలాండ్]], [[కంబోడియా]], [[మలేషియా]], [[వియత్నాం]], [[లావోస్]] దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో '''రామాయణము''' నృత్య నాటకము బాగా ప్రసిద్ధము.
 
పంక్తి 6:
24,000 శ్లోకాలతో కూడిన రామాయణము భారతదేశము, [[హిందూ ధర్మము]] ల [[చరిత్ర]], [[సంస్కృతి]], నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.
 
వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇతర భారతీయ భాషలలో [తులసీదాసు] [రామచరిత మానసము] (కడీ బోలీ), [కంబ రామాయణము] (తమిళం), [రంగనాధరామాయణము], [రామాయణ కల్పవృక్షము], [మందరము] (తెలుగు) వంటి అనేక కావ్యాలు ప్రాచుర్యము పొందాయి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్త్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కథలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి [[వాల్మీకి]] ప్రార్థన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.
 
: కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
"https://te.wikipedia.org/wiki/రామాయణం" నుండి వెలికితీశారు