వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పట్టణము → పట్టణం (3)
పంక్తి 1:
'''శ్రీ రాజా [['''వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు]]'''''' ([[ఏప్రిల్ 27]], [[1761]] - [[ఆగష్టు 17]], [[1817]]) [[గుంటూరు]] ప్రాంతమును పరిపాలించిన కమ్మ [[రాజు]]. [[అమరావతి]] సంస్థాన పాలకుడు.
 
== జననం ==
పంక్తి 10:
కృష్ణా డెల్టా ప్రాంతమందు వందకుపైగా [[దేవాలయము]]లు కట్టించాడు. వీటిలో [[అమరావతి]], [[చేబ్రోలు]], [[పొన్నూరు]], [[మంగళగిరి]] ముఖ్యమైనవి. వేంకటాద్రి నాయుని సైన్యములో వేలమంది సైనికులు, 300 గుర్రాలు, 80 ఏనుగులు, 50 ఒంటెలు, లెక్కలేనని ఎడ్లబండ్లు ఉండేవి. [[అమరావతి (గ్రామం)|అమరావతి]], [[చేబ్రోలు]], చింతపల్లిలలో నాయుని భవనములు సంపదతో తులతూగేవి. పండుగలనాడు పండితులకు, గ్రామపెద్దల కుటుంబాలకు పట్టువస్త్రములు, [[బంగారం|బంగారు]] ఆభరణములు బహూకరించబడుతుండేవి. నిరతాన్నదానములు జరుగుతుండేవి.
 
క్రీ.శ. 1791-92లో వచ్చిన భయంకర [[ఉప్పెన]]లో తీరాంధ్ర గ్రామములలో వేలమంది ప్రజలు మరణించారు. మరుసటి సంవత్సరము తీవ్రమైన కరవు వచ్చింది. నాయుడు గారు ఏడు సంవత్సరములుగా పేరుకుపోయిన పన్నులు, మూడున్నర లక్ష్లల బంగారు నాణెములు ప్రజల కొరకు వినియోగించుటకు [[బ్రిటిషు|బ్రిటీషు]] ప్రభుత్వానికి తెలియచేశారు. మచిలీపట్టణముమచిలీపట్టణం లోని అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇంతలో గవర్నర్ జనరల్ కార్న్ వాలిస్ సంస్కరణలలో ఈ విషయము మరుగున పడింది.
 
బ్రిటీషు ప్రభుత్వము నాయనింగారి సైనికులను నిరాయుధులను చేసింది. ఆగ్రహించిన నాయుడు చింతపల్లిని విడచి గుంటూరు మండలములోని ధరణికోట వద్ద అమరావతియను పట్టణముపట్టణం, [[భవనాలు]] కట్టించాడు. 1797లో [[అమరావతి]] పట్టణముపట్టణం దర్శించిన [[కోలిన్ మెకంజీ]] అచటి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్ లో పలువిధములుగా పొగిడాడు<ref>Indian Monuments, N. S. Ramaswami, 1971, Abhinav Publications, ISBN 0896840913, ప్. 115</ref>.
 
వేంకటాద్రి పాలనలో [[చెంచులు]] దారిదోపిడులు చేయుచు సామాన్య ప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]]గా మారింది.