రావణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, replaced: పట్టణము → పట్టణం, typos fixed: లేకుండ → లేకుండా
పంక్తి 1:
[[దస్త్రం:Ravana.jpg|thumb|200px|లంకాధీశుడు, రావణుని చిత్రణ]]
'''[[రావణుడు]]''' హిందూ ఇతిహాసమైన [[రామాయణము]]లో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు [[లంక]]కు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు.
రావణుడు ఒక గొప్ప రాజనీతి కలవాడు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు కలవాడు కనుకనే ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతనిని పూజిస్తున్నారు. మహా శివ భక్తుడు. ఎంత గొప్ప మేధావి అయిన ధర్మాన్ని పాటించక పోతే అన్ని వ్యర్థమే అనుదనికి రావణుడు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.
 
పంక్తి 21:
 
==క్లుప్త చరిత్ర==
రాక్షసుల రాజు. ఇతని రాజధాని లంక. తండ్రి [[పులస్త్యుని]] కొడుకు అగు విశ్రవసుఁడు. తల్లి [[సుమాలి]] కూతురు అగు [[కైకసి]]. భార్య మయుని కూఁతురు అగు [[మందోదరి]]. సోదరులు [[కుంభకర్ణ]] విభీషణులు. కొడుకులు [[ఇంద్రజిత్తు]] మొదలగువారు. ఇతనికి పదితలలు ఉండుటచే దశకంఠుఁడు, దశగ్రీవుఁడు అను నామధేయములు కలిగెను. ఇతఁడు మహత్తరము అగు తపము సలిపి బ్రహ్మవలన తనకు మనుష్యులు తక్క తక్కినవారిచే చావు లేకుండలేకుండా వరము పొంది ఆ వరప్రభావముచే మిగుల గర్వితుఁడు అయి త్రిలోకములయందు ఉండు సాధువులను, ఎల్లవారిని మిగుల హింస పెట్టుచు ఉండెను. ఆ హింసలకు ఓర్వఁజాలక మునులును దేవతలును బ్రహ్మచెంతకు పోయి మొఱలిడిరి. అప్పుడు బ్రహ్మ వారిని పిలుచుకొని పాలసముద్రమున ఉండు విష్ణువు దగ్గఱకు పోయి ప్రార్థింపఁగ అతఁడు మనుష్యరూపమున శ్రీరాముఁడు అనుపేర భూమిని అవతరించి ఈరావణుని చంపెను. చూ|| జయవిజయులు.
 
ఈ రావణుఁడు దిగ్విజయముచేయ బయలుదేఱినపుడు తొలుత [[కుబేరుడు|కుబేరు]]నితో తలపడి యుద్ధమునందు జయము పొంది అతని విమానము అగు పుష్పకమును అపహరించుకొని దానిపై ఎక్కి సంచరించు తఱిని అది కైలాసగిరి సమీపమున నిలుపఁబడఁగా అందులకు కారణము విచారించి శివుని మహిమ అని నంది వలన ఎఱిఁగి నావిమానమును అడ్డగించిన శివుని కొండతోడ ఎత్తిపాఱవైతును కాక అని కైలాసమును పెల్లగించి చెండాడినట్టు ఎగరవైవ ఆరంభించెను. అప్పుడు ఆకొండపై ఉన్న శివుఁడు తన కాలి పెనువ్రేలితో ఆకొండను అదుమఁగా వీనిచేతులు దానిక్రింద చిక్కుకొని ఊడతీసికొన కూడక పోయెను. ఆ బాధచే వీఁడు చిరకాలము గొంతెత్తి ఏడ్చి ఏడ్చి కడపట శివుని పలుదెఱుఁగుల నుతించెను. అంత అతఁడు కరుణార్ద్రచిత్తుఁడు అయి తన కాలివ్రేలిని ఎత్తఁగా వీఁడు తన చేతులను ఊడ తీసికొనెను. ఇట్లు ఆ కొండక్రింద చేతులు తగులుకోఁగా వీఁడు గొప్పధ్వనితో రోదనముచేసి నందున వీనికి రావణుఁడు అనుపేరు కలిగెను.
పంక్తి 47:
# [[విభీషణుడు]] - [[శ్రీ రాముడు|రామచంద్రమూర్తిని]] శరణాగతి కోరినవాడు. సీతను రామచంద్రుడికి తిరిగి ఇచ్చి శరణాగతిని కోరుకొనమని హితవచనాలు పలికిన కారణాన, రావణుడు విభీషణుడిని రాజ్యబహిష్కారం చేశాడు. విశ్వవసు బ్రహ్మ కుమారుడు, కైకసికి వరప్రసాదంగా జన్మించాడు. యుద్ధకాండ ప్రారంభంలో తన సహచరులతో, లంకనుండి ఆకాశమార్గాన వచ్చి రామచంద్రమూర్తి శరణాగతి కోరగా రాముడు యద్ధానికి పూర్వమే, రావణాసురుడు నిహతుడు కావడానికి ముందే లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు.
# [[కుంభకర్ణుడు]] - హిందూ పురాణాలలో అశ్చర్యము కలిగించే రాక్షసులలో కుంభకర్ణుడు ఒకడు. కనిపించిన జీవరాసులన్నింటినీ భక్షిస్తుంటే, [[ఇంద్రుడు|ఇంద్రుడి]] విజ్ఞప్తిపై కుంభకర్ణుడు ఎల్లకాలము నిద్రించేట్లుగా బ్రహ్మ శపిస్తాడు. (మూలము లేదు-బ్రహ్మ వరమిచ్చినప్పుడు తికమకకు గురై నిరంతర నిద్రలోకి వెళ్లేట్టు వరమును పొందాడు) ఈ విషయము విన్న రావణుడు దిగ్భ్రాంతికి గురై, సోదర వాత్సల్యముతో బ్రహ్మను వేడుకొని శాపాన్ని సడలించేట్లు చేస్తాడు. ఆ సడలింపు ప్రకారము కుంభకర్ణుడు సంవత్సరములో ఆరు నెలలు నిద్రావస్థలోను, ఒకరోజు మెలకువగాను ఉంటాడు. ఆ రోజు ఆరు నెలలకు సరిపడ ఆహారాన్ని భక్షిస్తాడు. రామునితో యుద్ధం జరిగే సందర్భములో అతి కష్టముతో కుంభకర్ణుని నిద్రనుండి లేవదీస్తారు. ఈయన రావణుని, ధర్మమార్గము అవలంబించి, సీతను తిరిగి పంపి రాముని శరణు వేడమని నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తాడు. రావణుని మార్చలేక సోదరుని తరఫున యుద్ధం చేసి యుద్ధరంగంలో మరణిస్తాడు. మరణించే ముందు విభీషణుని కలిసి ధర్మమార్గమున నడుస్తున్నందుకు దీవిస్తాడు.
# [[ఖరుడు]] - జనస్థానములో సత్కార్యాలను నిరోధించడానికి రావణాసురుడు ఖరుడిని నియమిస్తాడు. జనస్థానము యొక్క సరిహద్దులు దక్షిణమున లంకా పట్టణముపట్టణం, ఉత్తరమున [[అయోధ్య|కోసలరాజ్యము]]. శూర్పణఖ తనకు [[లక్ష్మణుడు]] జరిపిన పరాభవాన్ని వివరించగా, రామలక్ష్మణుల మీదకు యుద్ధానికి వెళ్ళి, అద్వితీయమైన యుద్ధము జరిపి రాముని బాణముచేత నిహతుడౌతాడు.
# [[దూషణుడు]] - జనస్థానములో ఖరుడి మంత్రి
# [[అహిరావణుడు]] - రావణుడు, మాయాసురుడు వంటి రాక్షసులు పాలించే [[అధోలోకము]]నకు చక్రవర్తి. ఇతనిని [[మైరావణుడు]]గా కూడా పిలుస్తారు.
"https://te.wikipedia.org/wiki/రావణుడు" నుండి వెలికితీశారు