ముహమ్మద్ బిన్ తుగ్లక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
==పరిపాలన==
 
[[Image:Tuglak tomb.jpg|thumb|తుగ్లక్ సమాధి, ఢిల్లీ.]]
తుగ్లక్ [[భారత ద్వీపకల్పం]] లోని ప్రాంతాలను జయించి తన సామ్రాజ్య విస్తరణకు నడుంకట్టాడు. దక్షిణ ప్రాంతాలపై పట్టు కొరకు తన రాజధానిని [[ఢిల్లీ]] నుండి [[దౌలతాబాదు|దేవగిరి]] కి మార్చాడు. ఢిల్లీ నుండి 700 మైళ్ళ దూరాన [[దక్కను]] లోగల దేవగిరిని, దౌలతాబాదు గా పేరుమార్చి రాజధానిగా ప్రకటించాడు. తన ప్రభుత్వకార్యాలయాను మాత్రమే మార్చక, మొత్తం ప్రజానీకానికి దౌలతాబాదుకు మకాం మార్చాలని హుకుం జారీ చేశాడు. దౌలతాబాదులో ప్రజా సౌకర్యాలు కలుగజేయడంలో విఫలుడైనాడు. కనీస వసతులైన నీటి సరఫరా కూడా చేయలేకపోయాడు. కేవలం రెండేండ్లలో, తిరిగీ రాజధానిగా ఢిల్లీని ప్రకటించి, ప్రజలందరికీ తిరిగీ ఢిల్లీ చేరాలని ఆజ్ఞలు జారీచేశాడు. ఈ అసంబద్ధ నిర్ణయానికి బలై, వలసలతో ఎందరో జనం మరణించారు. ఈ రెండేళ్ళకాలం ఢిల్లీ "భూతాల నగరంగా" మారిందని చరిత్రకారులు చెబుతారు. [[ఉత్తర ఆఫ్రికా]] కు చెందిన [[యాత్రికుడు]] [[ఇబ్నె బతూతా]] ఇలా వ్రాశాడు : 'నేను ఢిల్లీలో ప్రవేశించినపుడు, అదో ఎడారిలా వున్నది'.