కొండవీడు కోట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎కోట చరిత్ర: ఆంధ్రప్రదేశ్ వ్యాసం లో గల అంశం ఇక్కడ చేర్చాను
పంక్తి 37:
[[File:Kondavid6.jpg|thumb|కొండవీడు కోటలోని గోపినాధేశ్వర స్వామి ఆలయం |alt=|300x300px]]
ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజులలో ప్రథముడు.ఇతను తొలుత సా.శ.పూ. 1325లో [[అద్దంకి మండలం|అద్దంకిని]] రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 1353 వరకు పరిపాలించాడు. ఆ తరువాత అతని కుమారుడు అనపోతారెడ్డి సా.శ.పూ. 1353 నుండి 1364 వరకు రాజ్యపాలనను చేపట్టినట్లు తెలుస్తుంది. శత్రుమూకలు తరచూ అతని రాజ్యంపై దాడులు చేస్తుండడంతో రాజధానిని కొండవీడుకు తరలించి  రెండో రాజధానిగా చేసుకుని పాలన సాగించాడని తెలుస్తుంది. అనపోతారెడ్డి కొండవీడును శతృదుర్బేధ్యమైన గిరిదుర్గంగా మలచిన ఘనత అనపోతారెడ్డికి దక్కుతుంది.ఆ తరువాత అనపోతారెడ్డి తమ్ముడు అనవేమారెడ్డి సా.శ.పూ.1364 నుండి 1386 వరకు రాజ్యాధికారం చేపట్టి కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలను జయించి రాజ్య విస్తరణ గావించాడు. తిరిగి పినతండ్రి అనవేమారెడ్డి మరణానంతరం అనపోతారెడ్డ్డి కుమారుడు కుమారగిరిరెడ్డి సా.శ.పూ. 1386 నుండి 1402 వరకు పరిపాలించి కొండవీడు రాజ్యాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్‌ వరకు విస్తరించాడు. ఆ తరువాత అనవేమారెడ్డి కుమారుడు పెదకోమటి వేమారెడ్డి సా.స.పూ. 1402 నుండి 1420 వరకు పరిపాలించినట్లుగా తెలుస్తుంది.ఇతని పరిపాలనా కాలంలో సాహిత్యానికి, కళలకు పెద్దపీటవేసి ఆదరించినట్లుగా తెలుస్తుంది. ఒకరకంగా ఇతని పరిపాలనాకాలాన్ని  స్వర్ణయుగమని చెప్పవచ్చు. శ్రీనాథ కవి ఇతని ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడని తెలుస్తుంది.సా.శ.పూ 1420 నుండి  1424 వరకు చివరివాడైన  రాచ వేమారెడ్డి పరిపాలించాడు.ఇతను అసమర్థుడు కావడంతో రెడ్డిరాజుల పాలన అంతమైంది. కొండవీడు రాజ్యాన్ని [[విజయనగరం|విజయనగర]] రాజులు హస్తగతం చేసుకున్నారు.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=375288|title=కొండవీడు కోట చూసొద్దాం రండి...|date=2017-02-27|website=www.andhrajyothy.com|language=te|access-date=2019-10-20}}</ref>
 
[[కొండవీడు కోట|కొండవీడు కోటను]] యునెస్కో [[ఆసియా, ఆస్ట్రలేషియాల్లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా|ప్రపంచ వారసత్వ ప్రదేశంగా]] వర్గీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.<ref>{{Cite web|url=http://www.newindianexpress.com/states/andhra-pradesh/2016/dec/11/kondaveedu-fort-likely-to-get-unesco-heritage-status-1547919.html|title=Kondaveedu fort likely to get UNESCO heritage status|url-status=live|archive-url=https://web.archive.org/web/20170218063404/http://www.newindianexpress.com/states/andhra-pradesh/2016/dec/11/kondaveedu-fort-likely-to-get-unesco-heritage-status-1547919.html|archive-date=18 February 2017|access-date=17 February 2017}}</ref>
 
===కొండవీడు దుర్గంలో బౌద్ధం ఆనవాళ్ళు ===
"https://te.wikipedia.org/wiki/కొండవీడు_కోట" నుండి వెలికితీశారు